ఏంటి చెల్లెల్లాంటి అమ్మాయిని కమల్ హాసన్ ని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశారా.. ఇంతకీ కమల్ హాసన్ చెల్లెలు అనుకొని భావించిన ఆ అమ్మాయి ఎవరు.. కమల్ హాసన్ ని ఇంట్లో వాళ్ళు ఎందుకు ఒత్తిడి చేశారు అనేది ఇప్పుడు చూద్దాం.కమల్ హాసన్ చెల్లి అని భావించింది ఎవరినో కాదు ఓ స్టార్ హీరోయిన్ అట.అయితే ఆ హీరోయిన్ తో ఈ హీరో సన్నిహితంగా ఉండడం కారణంగానే వీరి మధ్య ఉన్న సాన్నిహిత్యం చూసిన చాలామంది ఇరుగు పొరుగువారు బంధువులు ఇంట్లో వాళ్ళు కమల్ హాసన్ ని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశారట.కానీ కమల్ హాసన్ మాత్రం నాకు ఆమె చెల్లెలు లాంటిది. నేను ఎప్పుడూ ఆమెను ఆ దృష్టితో చూడలేదు అని ఇంట్లో వాళ్లకు చెప్పారట. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే అతిలోకసుందరి శ్రీదేవి. అవును మీరు వినేది నిజమే.

ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా కమల్ హాసన్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.కమల్ హాసన్ శ్రీదేవి కాంబినేషన్లో కొన్ని సినిమాలు వచ్చాయి. అలా ఆ సినిమాల్లో వీరి మధ్య కెమిస్ట్రీ బాగుండడంతో వీరిద్దరూ ఎఫైర్ పెట్టుకున్నారని, డేటింగ్ చేస్తున్నారని కొన్ని రూమర్లు వినిపించాయి. అయితే ఈ రూమర్లు కోలీవుడ్ మీడియా మొత్తం వ్యాపించడంతో పాటు ఇరుగుపొరుగు వాళ్ళు ఇంట్లో వాళ్ళ దాకా కూడా చేరడంతో ఈ విషయం నిజం చేయాలని శ్రీదేవిని చూసి ఇంట్లో వాళ్ళు అమ్మాయి బాగుందని వెంటనే కమల్ హాసన్ తో పెళ్లి చేయాలని అనుకున్నారట.అయితే ఇదే విషయాన్ని కమల్ హాసన్ కి చెప్పి శ్రీదేవిని పెళ్లి చేసుకో అన్నారట.

కానీ కమల్ హాసన్ మాత్రం మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నాకు శ్రీదేవి చెల్లెల్లాంటిది.నేను ఎప్పుడు శ్రీదేవిని చెల్లిగానే చూశాను. కానీ వేరే ఉద్దేశంతో చూడలేదు.ఇంకొకసారి ఈ మాట అడగకండి అని మొహం మీదే చెప్పారట. ఇంట్లో పెద్దవాళ్లు సైతం ఇదే మాట అనడంతో ఆమె నా చెల్లెలు..కుటుంబ సభ్యురాలు లాగే చూస్తాను అని అనడంతో అప్పటినుండి శ్రీదేవి కమల్ హాసన్ మధ్య ఈ వార్తలు ఆగిపోయాయి  ఇక కమల్ హాసన్ గాఢంగా ప్రేమించిన హీరోయిన్ శ్రీవిద్య మాత్రమే నట. ఈ విషయాన్ని కూడా కమల్ హాసన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.  కానీ ఆమెను పెళ్లి మాత్రం చేసుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: