మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సోషియో ఫాంటసీ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి బింబిసారా ఫేమ్ మల్లాడి వశిష్ట దర్శకత్వం వహిస్తూ ఉండగా ... యూవీ క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష ఈ సినిమాలో చిరంజీవి కి జోడిగా కనిపించనుండగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే స్టార్ట్ అయింది.

మూవీ ని అనౌన్స్ చేసిన సమయం లోనే ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ వరకు ఈ సినిమాకు సంబంధించిన అనేక పనులు పెండింగ్ ఉండే అవకాశం ఉండడంతో ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండక్కి కాకుండా వేరే సమయంలో విడుదల చేస్తాం అని మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమాలో ఒక అదిరిపోయే ఐటమ్ సాంగ్ ను డైరెక్టర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ ఐటమ్ సాంగ్ కోసం ఇప్పటికే కీరవాణి పలు ట్యూన్స్ ను ఇచ్చినట్లు తెలుస్తుంది. కానీ ఆ ట్యూన్ లు చిరంజీవి ని పెద్దగా ఆకట్టుకోనట్లు తెలుస్తోంది. దానితో చిరంజీవిసినిమా లోని స్పెషల్ సాంగ్ కోసం కొత్త సంగీత దర్శకుడు అయినటువంటి భీమ్స్ సెసిరోలియో రికమెండ్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ కి కీరవాణి సంగీతం అందిస్తాడా ..? లేక బీమ్స్ సంగీతం అందిస్తాడా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: