
తరచూ సన్నిహితంగా కనిపించడం, తిరుమల-శ్రీకాళహస్తి ఆలయాలకు జంటగా వెళ్లడం, సమంత నిర్మించిన `శుభం` సక్సెస్ సెలబ్రేషన్‌లో రాజ్ సందడి చేయడం.. ఇవన్నీ నెట్టింట జరుగుతున్న ప్రచారానికి బలాన్ని చేకూర్చాయి. రీసెంట్ గా జరిగిన `తానా` 2025 ఎడిషన్ వేడుకలకు సమంత హాజరైన సంగతి తెలిసిందే. అయితే అమెరికాకు కూడా ఒంటరిగా కాదు జంటగానే వెళ్లింది.
సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే సమంత.. అమెరికా వెకేషన్ కు సంబంధించిన ఫోటోలను పంచుకుంది. అందులో రాజ్, సమంత ఒకరిపై ఒకరు చేయి వేసుకుని నవ్వుకుంటూ వెళ్తున్న ఫోటో మెయిన్ హైలెట్‌గా నిలిచింది. ఈ పిక్‌లో రాజ్-సామ్ చాలా క్లోజ్‌గా కనిపించారు. అలాగే మరో ఫోటోలో ఈ జంట తమ ఫ్రెండ్స్ లో డిన్నర్ కు వెళ్లినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. రాజ్ తో డేటింగ్ చేస్తున్న విషయాన్ని సామ్ కన్ఫార్మ్ చేసేసిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కొందరైతే ఈ జంటకు కంగ్రాట్స్ కూడా చెప్పేస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు