టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రష్మిక ఖాతాలో ఎన్నో విజయాలు ఉన్న సంగతి తెలిసిందే. నేషనల్ క్రష్ గా గుర్తింపును సొంతం చేసుకున్న రష్మిక కుబేర సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. ఇతర భాషల్లో సైతం ఈ సినిమా ఆదరణ పొందింది.

ఈనెల 18వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో బిచ్చగాడి పాత్రలో ధనుష్ నటించాడని చెప్పడానికి బదులుగా జీవించాడని చెప్పవచ్చు. ధనుష్ అద్భుతమైన అభినయం ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది. అయితే రష్మిక తాజాగా ఒక సందర్భంలో చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. మనం ఎవరినైనా ప్రేమిస్తే లేదా మనల్ని ఎవరైనా ప్రేమిస్తే మార్పు కచ్చితంగా జరుగుతుందని నేను నమ్ముతానని ఎందుకంటే భాగస్వామితో కలిసి ఉంటున్నప్పుడు వారితో కలిసి జీవితాన్ని పంచుకున్నప్పుడు ఇద్దరి వ్యక్తిత్వాల్లో మార్పు వస్తుందని రష్మిక చెప్పుకొచ్చారు.

ఒకరికి ఒకరు అభిప్రాయాలను పంచుకుంటారని ఇష్ట ఇష్టాలను తెలుసుకుంటారని ఒకరి కోసం ఒకరు మారతారని మీ ప్రాణ స్నేహితుడితో కానీ భాగస్వామితో కానీ కొంత కాలం ప్రయాణించాక పాత రోజులను గుర్తు చేసుకుంటే వాళ్ల కోసం మీరు ఎంతలా మారారో అర్థమవుతుందని ఆ మార్పునకు ఒకసారి మీరే ఆశ్చర్యపోతారని ఆమె వెల్లడించారు. యానిమల్ సినిమాలో హీరో పాత్ర స్వభావం ఉన్న వ్యక్తితో మీరు డేటింగ్ చేస్తారా? అతడిలో మార్పు తీసుకు రాగలరా అనే ప్రశ్నకు రష్మిక స్పందిస్తూ ఈ కామెంట్లు చేయడం గమనార్హం.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: