
అంత పర్ఫెక్ట్ గా ఆయన ఫిజిక్ ని మైంటైన్ చేస్తూ ఉంటాడు . మళ్ళీ ఫుడ్ డైట్ చేస్తాడా..? అంటే నో కడుపునిండా అన్ని కావాల్సినవి తింటాడు . దానికి తగ్గట్టు శారీరక శ్రమ పెట్టుకుంటాడు . కాగా రానా దగ్గుబాటికి హీరోగా తన కెరియర్ స్టార్ట్ చేసి ..విలన్ గా ప్రస్తుతం తన కెరీర్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు . భీమ్లా నాయక్ , బాహుబలి సినిమాలలో విలన్ షేడ్స్ పాత్రల్లో నటించి తన నటన పర్ఫామెన్స్ తో అందరిని ఆకట్టుకున్నాడు . కాగా రానా దగ్గుబాటి ముందుగానే ఓ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ లో మెరవాలి . కానీ ఆయన ఒప్పుకోలేదు .
పాత్ర చిన్నగా ఉండడం దానికి ప్రధాన కారణం. అయితే ఆ టైంలో మాత్రం చాలా మంది అతనిని తప్పుగా అర్థం చేసుకున్నారు . ఆ సినిమా మరింటో కాదు "బాద్షా". ఎన్టీఆర్ హీరోగా నటించిన బాద్షా సినిమాలో సిద్ధార్ధ్ స్పెషల్ క్యారెక్టర్ లో కనిపిస్తాడు . ఆయన కనిపించేది పది నిమిషాలు . ఆ తర్వాత బాంబ్ బ్లాస్ట్ లో ఆయన క్యారెక్టర్ చనిపోతుంది. ఈ పాత్ర కోసం ముందుగా రానా దగ్గుబాటినే అనుకున్నారట . కధ కూదా వినిపించారట . కానీ ఆయన రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత బాహుబలి సినిమాలో విలన్ షేడ్స్ లో నటించడానికి ఓకే చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా కనిపించి నటించి మెప్పించారు. ఆ టైంలో చాలామంది ఎన్టీఆర్ తో సినిమా రిజెక్ట్ చేశాడు ఎందుకు..? ప్రభాస్ , పవన్ కళ్యాణ్ సినిమాని ఓకే చేశాడు ఎందుకు..?? ఎన్టీఆర్ లో లేనిది ఏంటి ..? ప్రభాస్ , పవన్ లో ఉన్నది ఏంటి..?? అంటూ రకరకాలుగా మాట్లాడుకున్నారు. పర్సనల్గా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోలేదు . రానా దగ్గుబాటి క్యారెక్టర్ పరంగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడు . ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో బాగా హైలెట్ చేస్తూ ట్రెండ్ చేశారు ఆయన అభిమానులు..!!