గత శుక్రవారం రోజున థియేటర్లలో విడుదలైన జూనియర్ మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం దాదాపుగా 13 సంవత్సరాల తర్వాత జెనీలియా ఈ సినిమాతో రీయంట్రి ఇవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. రిలీజ్ రోజున ఈ సినిమా ఒకింత భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. రెండు రోజుల్లో ఈ సినిమా మూడు కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. కిరీటి తెలుగు ప్రేక్షకులకు కొత్త హీరో అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సాధించడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 1100 స్క్రీన్ లలో ఈ సినిమా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నా ఈ సినిమా భారీ స్థాయిలోనే కలెక్షన్లను సాధిస్తోంది.

సినిమా టార్గెట్ 10 కోట్ల రూపాయలు కాగా ఫుల్ రన్ లో  ఆ మార్కును సులువుగానే బ్రేక్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సినిమాలో ట్విస్టులు సైతం ఆసక్తికరంగా ఉండటం సినిమాకు ప్లస్ అయింది. వైరల్ వయ్యారి సాంగ్ సోషల్ మీడియాలో సంచలనాలను సృష్టిస్తోంది. తొలి సినిమాతోనే నటుడిగా ప్రూవ్ చేసుకున్న కిరీటి తర్వాత సినిమాలతో కూడా ఆ మ్యాజిక్ ని రిపీట్ చేస్తారేమో చూడాల్సి ఉంది. పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్లో క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తే మాత్రం కిరీటికి తిరుగుండదని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా సినిమాకు తన స్థాయిని పెంచుకుంటూ కిరీటి బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తారేమో చూడాల్సి ఉంది.

ఓవర్సీస్ లో సైతం ఈ సినిమా కలెక్షన్ల విషయంలో అదరగొడుతుందని తెలుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కిరీటి అదరగొట్టాలని రివ్యూలను చదివి కొన్ని విషయాలలో మార్పులు చేసుకుంటే స్టార్ హీరో స్టేటస్ను సులువుగానే అందుకోవడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి. త్వరలో ఈ హీరో భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సంబంధించి క్రేజీ అప్డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: