ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ తెలుగు ఫిలిం సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవికి బిగ్ హెటెక్ స్టార్ట్ అయ్యింది అనే సమాధానం వినిపిస్తుంది . మొదటి నుంచి మెగాస్టార్ చిరంజీవి పక్క ప్లానింగ్ తో ముందుకెళ్తూ ఉంటాడు . కాల్ షీట్స్ లో అస్సలు కన్ఫ్యూజ్ అవ్వడు.  ఏ సినిమాకి ఎన్ని కాల్ షీట్స్ అవసరమవుతాయి అనే విషయాన్ని పక్కాగా కేటాయిస్తూ ఉంటాడు . ఇప్పటివరకు ఆయన కెరియర్ లో కాల్ షీట్స్ కారణంగా ఆగిపోయిన సినిమాలే లేవు అని చెప్పుకోవడంలో సందేహమే లేదు .


అయితే ఇప్పుడు మాత్రం మెగాస్టార్ చిరంజీవికి ఒక కొత్త హెడేక్ స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది . మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు చిరంజీవి . ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఆధారంగా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నాము అంటూ పూజా కార్యక్రమాల రోజే ఓపెన్ గా చెప్పేసాడు అనిల్ రావిపూడి.  ఇప్పుడు మధ్యలోకి విశ్వంభర వచ్చేసింది .



విశ్వంభర ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ వి ఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్స్ కారణంగా ఆలస్యం అవుతూ వస్తుంది.  ఈ సినిమా ఇంకా ఆలస్యం అవుతుందట . లెక్క ప్రకారం చూసుకుంటే ఈ సినిమా అక్టోబర్ నెలలో రిలీజ్ చేయాలి అంటూ మేకర్స్ భావిస్తున్నారట . ఒకవేళ అక్టోబర్ నెలలో ఈ సినిమా రిలీజ్ చేయాలి అంటే కచ్చితంగా ప్రమోషన్స్ కోసం మెగాస్టార్ చిరంజీవి రెండు నెలల ముందు నుంచే అనిల్ రావిపూడి షూటింగ్ ఆపేయాలి . ఇక సినిమా షూటింగ్ ఆపేస్తే అనిల్ రావిపూడి మూవీ లేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి .



ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి నే కాదు ఈ సినిమాలో చాలామంది స్టార్స్ నటిస్తున్నారు.  ఒకరి కాల్ షీట్స్ కోసం ఒకరు శాక్రిఫైజ్ చేయలేని పరిస్థితి ఇప్పుడు ఇండస్ట్రీలో నెలకొంది . దీంతో మెగా స్టార్ - అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న సినిమా మరింత ఆలస్యం కాబోతుంది అంటున్నారు సినీ ప్రముఖులు . అంతేకాదు అనిల్ రావిపూడి ఇప్పటివరకు చెప్పిన టైం ని నెగిటివ్ గా ఎక్కడ చూపించలేదు . ఏ సినిమా ఏ తేదీన రిలీజ్ అవ్వాలి అనుకుంటే ఆ డేట్ న రిలీజ్ చేస్తాడు. చిరంజీవితో కూడా అదే విధంగా ముందుకు వెళుతున్న అనుకున్నాడు కానీ ఇప్పుడు ఊహించిన విధంగా విశ్వంభర తలనొప్పులు తీసుకొచ్చింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: