
మహేష్ బాబు బర్త్డ డే సందర్భంగా టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా "అతడు" రీ రిలీజ్ చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే . ఆ చిత్రాన్ని మళ్ళీ థియేటర్లో చూసి ఎంజాయ్ చేసేందుకు మహేష్ బాబు అభిమానులు మాత్రమే కాదు బిగ్ బడా స్టార్స్ కూడా రెడీ అవుతున్నారు . ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి హీరో మహేష్ బాబుకి బర్తడే విషెస్ అందించారు. సోషల్ మీడియా వేదికగా ట్విట్ చేశారు .
"సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు తెలుగు ఇండస్ట్రీకి ఎంతో గర్వకారణం. అసాధారణ ప్రతిభ ఆకర్షణతో అభిమానుల హృదయాలను కొల్లగొడుతున్నారు . మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి మీకు ఆశక్తిని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం మీరు మరింత యవ్వనంగా కనిపిస్తున్నారు . మీకు విజయంతో పాటు లైఫ్ లో దక్కాల్సిన సంతోషాలు అన్నీ కూడా దక్కాలి అంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మీకు ఒక అద్భుతమైన సంవత్సరం కావాలి "అంటూ ఆశిస్తున్నాను అంటూ మెగాస్టార్ ట్విట్ చేశారు . మెగాస్టార్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. కాగా అభిమానుల మనసులో ఉన్న మాటను మెగాస్టార్ భలే ఫన్నీగా చెప్పాడు అంటున్నారు జనాలు . మహేష్ బాబు ఏజ్ అవుతున్నా కూడా లుక్స్ పరంగా చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు . ఇదే విషయాన్ని మెగాస్టార్ కూడా ప్రస్తావించడం ఇప్పుడు హైలైట్ గా మారింది..!