
టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న పూరీ జగన్నాథ్ .."లైగర్ ,డబుల్ ఇస్మార్ట్" వంటి డిజాస్టర్లతో సతమతమైపోతున్నారు. ఆ తర్వాత ఎవరు ఆయనను నమ్మి కాల్ షీట్స్ ఇవ్వట్లేదు . కానీ విజయసేతుపతి మాత్రం కంటెంట్ పై ఉన్న నమ్మకంతో పూరి జగన్నాథ్ కి ఛాన్స్ ఇచ్చాడు. అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాలో స్పెషల్ గెస్ట్ రోల్ కూడా ఉంటుంది అంటూ తెలుస్తుంది. ఈ పాత్రలో టాలీవుడ్ యంగెస్ట్ క్రేజీ మాస్ హీరో ని చూస్ చేసుకున్నారట పూరి జగన్నాథ్ .
అంతేకాదు గతంలో ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ "జనగణమన"ను మహేష్ బాబు, విజయ్ దేవరకొండతో చేయాలి అనుకున్నాడు. కానీ అది కుదరలేదు . ఇప్పుడు ఈ యంగ్ హీరోతో చేయడానికి సిద్ధమవుతున్నాడట . ఈ "బెగ్గర్" సినిమా కంప్లీట్ అవ్వగానే ఆ హీరోతో "జనగణమన" సినిమాని సెట్స్ పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడట పూరి జగన్నాథ్ . అంతేకాదు ఈ పాత్ర క్లైమాక్స్ లో వచ్చే విధంగా ప్లాన్ చేశాడట. కచ్చితంగా థియేటర్లో ఆ హీరో ఎవరో చూస్తే మాత్రం పూనకాలు గ్యారెంటీ అంటున్నారు మూవీ మేకర్స్ .
విజయ్ సేతుపతి స్పెషల్ గా ఈ హీరో పేరుని రిక్వెస్ట్ చేసి మరి ఈ రోల్ కి సజెస్ట్ చేశారట . చాలామంది ఈ హీరో పేరుని సోషల్ మీడియాలో గెస్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు . కానీ చిత్ర బృందం మాత్రం ఇది ఒక స్పెషల్ సర్ప్రైజ్ గా అలానే సీక్రెసి మైంటైన్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఇక విజయ్ సేతుపతి ఈ పాత్రలో మూడు కోణాలు చూపించబోతున్నారట . విజయ్ సేతుపతి నెగిటివ్ షేడ్శ్ లో కనిపిస్తాడు అంటూ కూడా తెలుస్తుంది. మొత్తానికి పూరీ జగన్నాథ్ ఈసారి భారీగానే హిట్ కొట్టడానికి కష్టపడుతున్నాడు అంటున్నారు మూవీ లవర్స్. చూద్దాం మరి ఏం జరుగుతుందో...???