ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో రీ రిలీజ్ లో ట్రెండు జోరుగా పెరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఏదైనా స్టార్ హీరోల పుట్టిన రోజు వచ్చింది అంటే వారు నటించిన ఏదో ఒక సినిమాను రీ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. అలాగే ఆ హీరో అభిమానులు కూడా తమ అభిమాన నటుడి సినిమాను రీ రిలీజ్ లో అయినా సరే థియేటర్లలో చూడడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తూ ఉండడంతో అలా రీ రిలీజ్ అయిన సినిమాలు అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసిన దాఖలాలు కూడా చాలానే ఉన్నాయి.

మరికొన్ని రోజుల్లోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు రానున్న విషయం మన అందరికీ తెలిసిందే. సెప్టెంబర్ 2 వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన ఓ సూపర్ హిట్ మూవీ ని రీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. కొన్ని సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జల్సా అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. 

మూవీ ని కొంత కాలం క్రితమే రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా మంచి కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. మరో సారి పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ ని రీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. తాజాగా ఈ మూవీ బృందం వారు సెప్టెంబర్ 2 వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా జల్సా మూవీ ని రీ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: