ఒకప్పుడు యాంకర్ గా పనిచేసిన ఉదయభాను గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు. ఒకానొక సమయంలో వరుస షోలతో బిజీగా ఉన్న ఉదయభాను ఒక్కసారిగా ఆమె క్రేజ్ పడిపోయిందని చెప్పవచ్చు. ఈ విషయం పైన ఇటీవలే ఉదయభాను మాట్లాడుతూ టాలీవుడ్లో యాంకర్స్ సిండికేట్ ఉందంటూ తెలియజేసింది. అప్పటినుంచి ఈమె గురించి ఏదో ఒక విషయం అయితే వైరల్ గా మారుతోంది. ఇప్పుడు తాజాగా ఉదయభాను చేసిన వ్యాఖ్యలు మరింత హాట్ టాపిక్ గా మారుతున్నాయి.


తాను యాంకర్ గా పనిచేస్తున్నప్పుడు చాలామంది ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ ఇవ్వకుండా ఎగ్గొట్టారని ఆరోపణలు చేసింది. ఉదయభాను నటించిన బార్బరిక్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఉదయభాను పలు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. తాను యాంకర్ గా చేస్తున్న సమయంలో వివిధ షోలకు ఇచ్చినటువంటి చెక్కులు బౌన్స్ అవ్వగా ఇప్పటికీ అవి తన దగ్గరే ఉన్నాయని తెలియజేసింది. అలా చెక్ బౌన్స్ అయిన వాటితో ఇంటికి తోరణాలు అలంకరించుకోవచ్చు అంటూ నవ్వుతూ తెలిపింది ఉదయభాను. ఒకవేళ డబ్బులు గురించి గట్టిగా అడిగితే మాత్రం ఉదయభాను డబ్బుల కోసమే అందర్నీ పీడిస్తూ ఉన్నదంటూ బయట నీచంగా ప్రచారం చేస్తున్నారంటూ వాపోయింది.


ముఖ్యంగా టీవీ షోలు చేస్తున్న సమయంలో కంటే బయట ఈవెంట్స్ వెళ్ళినప్పుడే తనకు బాగా డబ్బులు వచ్చేయని తెలియజేసింది. వాటితోనే జీవితంలో తాను నిలదొక్కుకున్నాను అంటూ తెలియజేసింది ఉదయభాను. యాంకర్ గా తనకు పలు షోలలో అవకాశాలు వచ్చిన చివరి నిమిషంలో మరొకరికి వెళ్లేవి అంటూ తెలియజేసింది. యాంకర్ గా ఉన్న సమయంలో అత్యధికంగా రెమ్యూనరేషన్ అందుకునే యాంకర్గా అనే పేరు ఉన్నప్పటికీ కూడా తనకు ఇలాంటి ఇబ్బందులు వచ్చాయని చెక్ బౌన్స్ విషయంలో చాలాసార్లు మోసపోయానని తెలిపారు. అయితే తాను ఎవరిని కించపరచడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు.. తాను ఈ వ్యాఖ్యలు చెప్పడం వల్ల భవిష్యత్తులో మరి కొంతమంది యాంకర్లకు ఇలాంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పానని తెలుపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: