మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ యంగ్ నటి మణులలో ఒకరు అయినటువంటి అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె నితిన్ హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అఆ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , అలాగే ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. ఈ మూవీ తర్వాత ఈమెకు తెలుగు లో అనేక సినిమాలలో అవకాశాలు వచ్చాయి.

అందులో ఈమె చాలా మూవీలతో ఈ బ్యూటీ మంచి విజయాలను అందుకోవడంతో అనుపమ చాలా తక్కువ కాలం లోనే తెలుగు పరిశ్రమలో మంచి స్థాయికి చేరుకుంది. కెరియర్ ప్రారంభంలో ఈమె చాలా శాతం సినిమాలలో స్కిన్ షో కు దూరంగా ఉంది. ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ తన అందాలను కూడా సినిమాల్లో భారీగా ఆరబోస్తూ వస్తుంది. ఈ నటి రౌడీ బాయ్స్ సినిమాలో మొట్ట మొదటి సారి భారీ స్థాయిలో అందాలను ఆరబోసింది. ఆ తర్వాత టిల్లు స్క్వేర్ మూవీ లో తన అందాల ఆరబోత డోసును మరింతగా పెంచింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ పరదా అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది.  ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదల అయింది.

ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి టాక్ వచ్చింది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. దానికి అనుపమ పరమేశ్వరన్ కూడా అటెండ్ అయ్యింది. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ ... పరదా సినిమా నా కెరియర్ లోనే బెస్ట్ సినిమా. ఇది వైన్ లాంటి సినిమా. సమయం గడుస్తున్న కొద్ది బాగుంటుంది అని చెప్పుకొచ్చింది. తాజాగా పరదా సినిమా గురించి అనుపమ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: