బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 2 విన్నర్ అయినటువంటి కౌశల్ మందా అంటే అందరికీ తెలుసు.. ఈయన బిగ్ బాస్ 2 లో సింగిల్ గా ఆడి హౌస్ లో ఉన్న అందరితో ఛీ కొట్టించుకున్నారు.కానీ బయట మాత్రం ఈయనకి చాలామంది అభిమానులు ఉన్నారు.అలా చివరికి సీజన్ -2 విన్నర్ గా నిలిచారు. అయితే అలాంటి బిగ్ బాస్ -2 విన్నర్ కౌశల్ మందా తాజాగా బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ.. బిగ్ బాస్ సీజన్ 9 కి సంబంధించి కామనర్స్ ని తీసుకోవడం అగ్నిపరీక్ష అనే కాన్సెప్ట్ తో రావడం చాలా బాగుంది. కానీ ఇందులో ఒకటి నాకు నచ్చలేదు.బిగ్ బాస్ అగ్నిపరీక్షకి జడ్జిలుగా అభిజిత్ బిగ్ బాస్ 4  విన్నర్ కాబట్టి కూర్చోబెట్టారు.అలాగే బిందు మాధవి కూడా విన్నర్ కాబట్టి కూర్చోబెట్టారు. 

కానీ నవదీప్ ని ఏ లెక్కన కూర్చోబెట్టారు.నవదీప్ ఏమైనా బిగ్ బాస్ విన్నర్ అయ్యారా..ఆయన ఏమైనా ట్రోఫీ గెలిచారా? మూడో ప్లేస్ లో ఉన్న ఆయన్ని ఎలా కూర్చోబెడతారు.. ఇది ఒక్కటే నాకు నచ్చలేదు. చాలామంది నన్ను అడుగుతున్నారు ఇప్పటికే చాలామంది బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన వారు అలాగే ట్రోఫీలు గెలిచినవారు మళ్లీ బిగ్ బాస్ కి గెస్ట్లుగా వస్తున్నారు.కానీ మీరు మాత్రం ఎందుకు రావడం లేదని అంటున్నారు. అయితే నాకు అసలు బిగ్ బాస్ ట్రోఫీ ఇవ్వడమే బిగ్ బాస్ యాజమాన్యానికి నచ్చలేదు.కేవలం నాకు ప్రజలు వేసిన ఓట్ల కారణంగానే ఇష్టం లేకుండానే కప్ ఇచ్చేశారు. అయితే నాకంటే వెనుక ఉన్న వారికి కప్ ఇచ్చేద్దాం అనుకున్నారు.

కానీ నా ఓట్లకి నా వెనుక ఉన్న వారి ఓట్లకి మధ్య నక్కకి నాగలోకానికి మధ్య ఉన్నంత తేడా ఉంది.అందుకే ఇష్టం లేకుండానే నాకు ట్రోఫీ ఇచ్చారు.ఇక ఇప్పటివరకు జరిగిన ఎనిమిది సీజన్లలో ఏడు సీజన్ లకి విన్నర్ ని అనౌన్స్ చేసినప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు లేదా హోస్ట్ గా చేసిన వాళ్ళు చేతులు పట్టుకొని విన్నర్ ని అనౌన్స్ చేశారు.కానీ నేను విన్ అయిన సమయంలో మాత్రమే విన్నర్ ని స్క్రీన్ మీద చూపించారు.కనీసం చేతులు పట్టుకొని విన్ అయ్యారు అని చెప్పడం కూడా వాళ్లకు ఇష్టం లేదు.నాకు ట్రోఫీ ఇవ్వడం ఇష్టం లేని వాళ్లు మళ్లీ నన్ను బిగ్ బాస్ లోకి ఎందుకు పిలుస్తారు అంటూ బిగ్ బాస్ యాజమాన్యం పై, బిగ్ బాస్ పై సంచలన ఆరోపణలు చేశారు కౌశల్ మందా..

మరింత సమాచారం తెలుసుకోండి: