మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మణులలో ఒకరు అయినటువంటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటివరకు అనేక సినిమాలలో నటించి ఎన్నో సినిమాల్లో తన నటనతో , కొన్ని సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. తమిళ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టిన ఈ ముద్దు గుమ్మ నేను శైలజ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. టాలీవుడ్ ఇంట్రెస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే ఈమెకు మంచి విజయం దక్కింది.

ఆ తర్వాత కూడా ఈమెకు నేను లోకల్ , మహానటి సినిమాలతో మంచి విజయాలు దక్కడంతో చాలా తక్కువ కాలం లోనే ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఈమె అటు తమిళ్ , ఇటు తెలుగు రెండు ఇండస్ట్రీ లలో కూడా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. అసలు విషయం లోకి వెళితే ... నటుడు మరియు దర్శకుడు అయినటువంటి మిస్కిన్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో కీర్తి సురేష్ నటించబోతున్నట్టు తెలుస్తోంది.

మిస్కిన్ , కీర్తి సురేష్ తో కోర్టు రూమ్ డ్రామా ని రూపొందించబోతున్నట్లు , అందులో భాగంగా ఇప్పటికే కీర్తి సురేష్ కు ఓ కథను కూడా వినిపించినట్లు , కథ మొత్తం విన్న కీర్తి సురేష్ కి ఆ స్టోరీ బాగా నచ్చడంతో వెంటనే మిస్కిన్ దర్శకత్వంలో రూపొందబోయే కోర్టు రూమ్ డ్రామా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. కెరియర్ ప్రారంభంలో కీర్తి సురేష్ సినిమాల్లో స్కిన్ షో కి చాలా దూరంగా ఉంటూ వచ్చింది. కానీ ఈ మధ్య కాలంలో ఈమె సినిమాల్లో తన అందాలతో కూడా ప్రేక్షకులను భాగానే ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ks