
ఈ ఫ్యాన్ వార్స్ పక్కన పెడితే, ఇటీవల తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, అల్లు అరవింద్ తల్లి గారు కనకరత్నం గారు కన్నుమూశారు. ఆమె మరణం తెలుగు సినీ రాజకీయ రంగాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు అందరూ హైదరాబాదులో సోమవారం జరిగిన పెద్దకర్మ కార్యక్రమానికి హాజరై కుటుంబానికి సంతాపం ప్రకటించారు. అల్లు అర్జున్, అల్లు సిరీష్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి పెద్దలు అందరూ కలిసి సాంప్రదాయబద్ధంగా పెద్దకర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలు కూడా తీసుకున్నారు.
అందులో ఒక ఫోటో మాత్రం సోషల్ మీడియాలో హైలైట్‌గా మారింది. ఆ ఫోటోలో రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తున్నారు. ఈ ఫోటోని చూసి అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. “ఈ ఫోటోలో అన్నీ బాగానే ఉన్నాయి కానీ చిరంజీవి గారు, అకిరా నందన్ కూడా ఉంటే మరింత హైలైట్‌గా ఉండేది” అని కామెంట్స్ చేస్తున్నారు. నిజమే, అల్లు-మెగా ఫ్యాన్స్ ఎప్పుడూ ఒకరితోఒకరు సరదాగా ఉంటారు . కానీ ఈసారి మాత్రం అభిమానుల కామెంట్స్ జెన్యూన్‌గా ఉన్నాయి. మెగా ఫ్యామిలీ పవర్ ఇమేజ్‌కి ఈ ఫోటో ఒక సింబల్‌గా మారింది. ఫ్యాన్స్ మధ్య “నువ్వా నేనా” అన్న ట్యాగ్ ఆఫ్ వార్ కాస్త పక్కనపడి, ఈసారి అందరూ కలిసిపోతూ మెగా-అల్లు కుటుంబానికి మద్దతు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోకి సంబంధించిన హ్యాష్‌ట్యాగ్స్ కూడా ట్రెండింగ్‌లోకి వచ్చాయి. అభిమానులు ఈ ఫ్రేమ్‌ని “గోల్డెన్ మెమరీ” అని పిలుస్తూ విపరీతంగా షేర్ చేస్తున్నారు.