
కన్నడలో పవన్‌కు ఉన్న ఫాలోయింగ్, గ్యాంగ్‌స్టర్ కథ కావడంతో అక్కడ కూడా ఓజీ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకు ఎస్ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్ మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. మరింతగా థమన్ మార్క్ మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద అస్త్రంగా మారుతుందని టాక్. ప్రఖ్యాత డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, అత్యంత భారీ బడ్జెట్‌తో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా విజువల్స్‌ను హై ఎండ్స్‌లో తీర్చిదిద్దుతున్నారు.
సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఓజీ గ్రాండ్ రిలీజ్ కానుంది. పవన్ గెటప్, యాక్షన్ సీన్స్, గ్యాంగ్‌స్టర్ అటిట్యూడ్ ఇప్పటికే టీజర్, పోస్టర్లలో చూపించినంతవరకే ఫ్యాన్స్‌ని మంత్రముగ్ధులను చేశాయి. విడుదల రోజున ఈ సినిమా బాక్సాఫీస్‌ను కుదిపేయడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. “ఓజి” పవన్ కెరీర్‌లోనే మాసివ్ హిట్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో గట్టిగా కనిపిస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు