ఏంటి ఆ హీరోయిన్ కి భర్త చనిపోయిన వారానికే పెళ్లి చేశారా.. ఇదెక్కడి విడ్డూరం.. భర్త చనిపోయిన వారానికే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా..వినడానికి ఆశ్చర్యంగా ఉంది అని ఈ విషయం తెలిసిన చాలా మంది నోరెళ్లబెడుతూ ఉంటారు. అయితే ఇది నిజమే..ఎందుకంటే స్వయంగా ఆ హీరోయిన్ తన నోటితోనే ఈ నిజాన్ని బయట పెట్టింది. మరి ఇంతకీ భర్త చనిపోయిన వారానికే ఏ హీరోయిన్ పెళ్లి చేశారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. సీనియర్ నటి మీనా భర్త విద్యా సాగర్ కరోనా సమయంలో అనగా 2022లో మరణించిన సంగతి తెలిసిందే. అయితే మీనా భర్త చనిపోయిన వారం రోజులకే మీనా రెండో పెళ్లి చేసుకోబోతుందని కొంతమంది వార్తలు క్రియేట్ చేశారు. అయితే ఈ వార్తలపై తాజాగా మీనా జయమ్ము నిశ్చయమ్మురా షోలో మాట్లాడింది.

నా భర్త చనిపోయిన వారానికే నాకు పెళ్లి చేసేసారు.. అసలు ఇలాంటి వారికి మనస్సాక్షి ఉండదు. వీళ్ళకి అసలు మనసు ఉందా అనిపిస్తుంది.. భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో నేనుంటే చనిపోయిన వారం రోజులకే నా రెండో పెళ్లి వార్తలు రాసేశారు. అలాగే ఈ రెండో పెళ్లి వార్తలపై ఎన్నిసార్లు ఖండించినా కూడా నన్ను వదిలిపెట్టలేదు.నా భర్త చనిపోయాక దాదాపు రెండు సంవత్సరాల వరకు నేను మామూలు మనిషిని కాలేదు. ఇక ఆ తర్వాత కాస్త బయటికి వచ్చాను అంటే అది కూడా నా స్నేహితుల వల్లే.నా స్నేహితులు నాకు చాలా సపోర్ట్ చేశారు. వారి వల్లే నేను మామూలు మనిషిని అయ్యాను. కానీ రెండో పెళ్లి వార్తలు మాత్రం నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టాయి.

ఎవరైనా హీరో విడాకులు తీసుకుంటే చాలు ఆ విడాకులైన హీరోని నేను రెండో పెళ్లి చేసుకున్నట్టు రాసేశారు.. అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడింది మీనా. అలా భర్త చనిపోయిన వారం రోజులకే నాకు పెళ్లి చేశారంటూ మీనా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక ఇదే షోలో సౌందర్యతో ఉన్న బంధం గురించి ఫ్లైట్ ప్రమాద గురించి మాట్లాడుతూ.. ఆ రోజు సౌందర్య తో పాటు నేను కూడా క్యాంపెనింగ్ వెళ్లాల్సి ఉండేది.కానీ నేను వేరే సినిమా షూటింగ్లో బిజీగా ఉండడంవల్ల వెళ్లలేకపోయాను.ఒకవేళ నేను ఆరోజు సౌందర్య తో పాట క్యాంపెయిన్ కి వెళితే నేను కూడా చనిపోయేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది.అలాగే సౌందర్య మరణం గురించి తలచుకొని కన్నీళ్లు పెట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: