తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో శివ కార్తికేయన్ ఒకరు. ఈయన ఇప్పటివరకు చాలా సినిమాల్లో హీరో గా నటించాడు. ఈయన హీరో గా నటించిన సినిమాలలో అనేక మూవీ లు అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈయన ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన మదరాసి అనే సినిమాలో హీరో గా నటించాడు. రుక్మిణి వసంత్ ఈ మూవీ లో శివ కార్తికేయన్ కి జోడి గా నటించింది. శివ కార్తికేయన్ కొంత కాలం క్రితం అమరన్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే.

మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అమరన్ లాంటి అద్భుతమైన విజయవంతమైన సినిమా తర్వాత శివ కార్తికేయన్ నటించిన సినిమా కావడం , దానికి మురగదాస్ దర్శకత్వం వహించడంతో మదరాసి సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలా మంచి అంచనాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా పెద్ద స్థాయి కలెక్షన్లను వసూలు చేయడం చాలా కష్టం అని చాలా మంది అభిప్రాయ పడ్డారు. 

ఇకపోతే ఈ మూవీ ఓ రేర్ మార్క్ కలెక్షన్లను తాజాగా అందుకుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మేకర్స్ విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇకపోతే నెగటివ్ టాక్ తో కూడా ఈ సినిమా 100 కోట్లు కలెక్షన్లను వసూలు చేయడంతో శివ కార్తికేయన్ కి మామూలు క్రేజీ లేదు అని అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

sk