
అలా చికిత్స తీసుకుంటున్న రోబో శంకర్ సెప్టెంబర్ 18న మరణించారు. ప్రస్తుత ఈ నటుడు వయసు 46 సంవత్సరాలు. గతంలో కూడా ఒకసారి ఈ కామెర్ల వ్యాధితో బాధపడిన రోబో శంకర్ వాటి నుంచి కోలుకొని మళ్లీ సినిమాలలో రీ ఎంట్రీ ఇచ్చారు. రోబో శంకర్ దీపావళి, హే, తదితర చిత్రాలను నటించారు. ముఖ్యంగా కామెడీ టైమింగ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రోబో శంకర్ లేరనే విషయం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ విషయం విన్న నటి నటులు ,అభిమానులు సైతం రోబో శంకర్ కు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రోబో శంకర్ మృతదేహాన్ని చెన్నైలోని వలసరవక్కంలో తన స్వగ్రామానికి తరలించారు. ఈ రోజున ఆయన అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. రోబో శంకర్ మొదట్లో గ్రామాలలో రోబో నృత్యాలు చేస్తూ ఉండేవారని ఆ తర్వాత మిమిక్రీ ఆర్టిస్ట్ గా మారి సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటినుంచి రోబో శంకర్ గా పేరు సంపాదించారు. 1997లో ధర్మచక్రం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రోబో శంకర్ సుమారుగా 80 కి పైగా చిత్రాలలో నటించారు. 2025లో చివరిగా సొట్ట సొట్ట నానైముతు వంటి చిత్రంలో నటించారు.