పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఓజి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా ... యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించగా .. అర్జున్ దాస్ , శ్రేయ రెడ్డి , ప్రకాష్ రాజ్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ నిన్న అనగా సెప్టెంబర్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. కానీ ఈ సినిమాకు సంబంధించిన పెయిడ్ ప్రీమియర్ షో లను సెప్టెంబర్ 24 వ తేదీన రాత్రి నుండే చాలా ప్రాంతాలలో ప్రదర్శించారు.

మూవీ ప్రీమియర్ షో లకు అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ కు కర్ణాటక ఏరియాలో అద్భుతమైన క్రేజ్ ఉంటుంది అనే విషయం మన అందరికి తెలిసిందే. దానితో ఆయన నటించిన సినిమాలకు కర్ణాటక ఏరియాలో కూడా మంచి కలెక్షన్స్ వస్తాయి. ఇక ఓజి మూవీ పై మొదటి నుండి కర్ణాటక ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. దానితో ఓజి మూవీ కర్ణాటకలో ప్రీమియర్స్ మరియు మొదటి రోజుతో కలుపుకొని అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... కర్ణాటక వ్యాప్తంగా మొత్తం 200 ప్రీమియర్ షో లను ప్రదర్శించగా , మొత్తం 200 ప్రీమియర్ షో లకు గాను ఓజి మూవీ కి 3 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక మొత్తంగా ప్రీమియర్స్ తో పాటు తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ తో కలిపి కర్ణాటక ఏరియాలో ఓజి సినిమాకు 7 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. ఇలా ఓజి మూవీ కి ప్రీమియర్స్ మరియు మొదటి రోజుతో కలుపుకొని కర్ణాటక ఏరియాలో 7 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా ఓజి మూవీ కర్ణాటక ఏరియాలో అద్భుతమైన ఇన్ఫెక్ట్ ను చూపించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: