
ఇందులో భాగంగా తాజాగా ది రాజా సాబ్ ట్రైలర్ కి సంబంధించి ఒక న్యూస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. రాజా సాబ్ సినిమా ట్రైలర్ కు సంబంధించి పనులు పూర్తి అయ్యాయని మొత్తం ఐదు భాషలలో సెన్సార్ పూర్తి అయ్యిందని.. UA 13+ సర్టిఫికెట్ కూడా జారీ అయినట్లు వినిపిస్తున్నాయి. ట్రైలర్ కూడా 3:30 సెకండ్ల పాటు నిడివితో ఉండడమే కాకుండా అక్టోబర్ ఒకటవ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయం పైన ఇంకా అఫీషియల్ గా చిత్ర బృందం అనౌన్స్మెంట్ చేయాల్సి ఉంది. ఈ విషయం విన్న అభిమానులు ఖుషీ అవుతున్నారు.
రాజా సాబ్ సినిమాలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు అలాగే సంజయ్ దత్ ఇందులో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. మరి ట్రైలర్ తో ఎలాంటి సునామిని సృష్టిస్తారో చూడాలి మరి..ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం కల్కి 2, స్పిరిట్, ఫౌజి, సలార్ 2 వంటి చిత్రాలు ఉన్నాయి. ఇవే కాకుండా మరికొన్ని చిత్రాలు వెయిటింగ్ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది.