టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తారక్ ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించి ఎన్నో విజయాలను అందుకున్నాడు. ఈయన కొంత కాలం క్రితం ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఇండియా వ్యాప్తంగా తారక్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈయన నటించిన దేవర పార్ట్ 1 , వార్ 2 సినిమాలు కూడా ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషలలో విడుదల అయ్యాయి. ఈ మూవీ లతో తారక్ క్రేజ్ మరింతగా పెరిగి పోయింది.

ఇది ఇలా ఉంటే కన్నడ నటుడు రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో కాంతారా చాప్టర్ 1 అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని అక్టోబర్ 2 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న రాత్రి ఈ మూవీ బృందం ఈ సినిమాకి సంబందించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తారక్ ముఖ్య ఆతిథిగా విచ్చేశాడు. ఇక ఈ ఈవెంట్ లో భాగంగా తారక్ అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.  

కాంతారా చాప్టర్ 1 సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా తారక్ మాట్లాడుతూ  ... దాదాపు నాకు మూడు సంవత్సరాలు ఉన్న వయసులో అమ్మమ్మ మన ఊరు కుందాపుర సమీపంలో ఉంటుంది అని , అక్కడికి సంబంధించిన అనేక కథలను నాకు చెబుతూ ఉండేది. అవన్నీ కూడా నాకు ఎంతో బాగా నచ్చేది. కానీ ఇలా కూడా జరుగుతుందా అనే సందేహాలు నాకు వచ్చేవి. నేను విన్న కథలతో సినిమాలు వస్తాయి అని అస్సలు అనుకోలేదు. కానీ రిషబ్ శెట్టి నేను విన్న కథలతో సినిమా చేసి సక్సెస్ అయ్యాడు అని తాజాగా తారక్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: