బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన వారిలో షారుక్ ఖాన్ కూడా ఒకరు. ఇప్పటికి వరుస సినిమాలతో బిజీగా ఉన్న షారుఖ్ ఖాన్ ఒకవైపు సినిమాలతో ఫ్యాన్స్ ను అలరించడమే కాకుండా తన కూతురు, కొడుకును కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే ఇప్పుడు తాజాగా షారుఖ్ ఖాన్ ఆస్తులు హాలీవుడ్ హీరోలను మించిపోయి ఉందంటూ వినిపిస్తున్నాయి. ప్రముఖ ది హురాన్ ఇండియన్ అనే సంస్థ 2025 కు గాన పలు విభాగాలలో రిచెస్ట్ పర్సన్స్ ను ప్రకటించింది. ఇందులో షారుక్ ఖాన్ పేరు కూడా ఉన్నది.


బాలీవుడ్ టాప్ రిచెస్ట్ సెలబ్రెటీ గా షారుక్ ఖాన్ నిలిచారు. 1.4 బిలియన్ డాలర్లు అంటే సుమారుగా 12,490 కోట్ల విలువైన ఆస్తులతో షారుఖ్ టాప్ లో నిలిచారు. కేవలం సినిమాలలోనే నటిస్తూ రెమ్యూనరేషన్ తో కాకుండా, తన  నిర్మాణ సంస్థలలో పెట్టుబడులు, యాడ్స్ , కోల్కత్తా నైట్ రైడర్స్ వంటి వాటిలో భాగస్వామిగా కాకుండా, రియల్ ఎస్టేట్, ఇతరత్రా కంపెనీలలో కూడా వాటాదారునిగా మారారు షారుక్ ఖాన్. వీటివల్ల షారుఖ్ ఖాన్ ఆస్తులు కూడా భారీగానే పెరిగినట్లు వినిపిస్తోంది.

గత కొన్నేళ్లుగా షారుక్ ఖాన్ రిచెస్ట్ హీరోగా బాలీవుడ్ లిస్టులో ఉన్నారు. ఈ విషయంలో ఇప్పుడు నెంబర్ వన్ పొజిషన్ కి చేరుకున్నట్లు వినిపిస్తోంది. షారుక్ ఖాన్ తో పాటుగా.. జుహీ చావ్లా, హృతిక్ రోషన్, కరణ్ జోహార్లు ఆ తర్వాత స్థానాలు దక్కించుకున్నట్లు తెలియజేసింది. షారుఖ్ ఖాన్ ఆస్తి విలువ కొంతమంది హాలీవుడ్ సెలబ్రెటీలను మించిపోయి ఉందంటు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా హాలీవుడ్ సింగర్ టైలర్ స్విఫ్ట్ 1.3 బిలియన్ డాలర్లు కలవు, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ 1.2 బిలియన్ డాలర్లు కలవు, నటి సెలెనా గోమెజ్ 600 మిలియన్ డాలర్లు కలవు. వీటిని బట్టి చూస్తే వీరందరి కంటే షారుఖ్ ఖాన్ ఆస్తి విలువ ఎక్కువగా ఉందని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: