బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇలా ఈ పార్టీ గుర్తుపై గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు  కోర్టులో ఫిర్యాదు చేశారు.. ఇదే తరుణంలో పార్టీ ఫిరాయించిన ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్యలను న్యాయవాదులు ప్రశ్నించారు. మీరు కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే తెలంగాణ భవన్ కు ఎందుకు రావడంలేదు. మీ అధినేత కేసీఆర్ ని ఎందుకు కలవడం లేదు.. ఇవన్నీ పక్కన పెడితే అసలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై బీఆర్ఎస్ చేస్తున్న ప్రోగ్రాంలో మీరు ఎందుకు పాల్గొనడం లేదని  న్యాయవాదులు ప్రశ్నించారు. అంతేకాకుండా  మీరు ఢిల్లీకి వెళ్లి  సీఎం రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పెద్ద నాయకులతో కలిసి ఫోటోలు దిగారు. కండువాలు కప్పుకున్నారు అలా ఎందుకు చేశారని కూడా ప్రశ్నించారు. 

అలాగే మీరు బిజెపి, బీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ లో చేరాలని మోటివేట్ చేస్తున్న ఫోటోలు కూడా సోషల్  మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి అది ఏంటి అని ప్రశ్నించారు. వీటన్నింటికీ సమాధానంగా మేము సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్ళింది నిజమే కానీ మేము ఆ పార్టీలోకి వెళ్లలేదు. మేము ఫోటోలు దిగే సమయంలో  మా పక్కన ఇతర నాయకులు ఉన్నారు. దానికి మేమేం చేస్తాం అని కాలే యాదయ్య,  ప్రకాష్ గౌడ్ లు సమాధానం ఇచ్చారు. ఈ విధంగా ఈ ఇద్దరు ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది.కానీ ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేల  క్రాస్ ఎగ్జామినేషన్ ఈ నెల నాలుగున నిర్వహించబోతున్నారు.  దీనికి సంబంధించి ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ సమక్షంలో నోటీసులు కూడా అందించారు.  గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి క్రాస్ ఎగ్జామినేషన్  4న జరగనుంది.

ఇదే తరుణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున న్యాయవాదులు కనీసం 80 నుంచి 85 ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ నెల నాలుగున ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలను న్యాయవాదులు ప్రశ్నించనున్నారు. మరి వారు ఎలాంటి సమాధానం ఇస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది.. కట్ చేస్తే పార్టీ ఫిరాయింపు అనేది బీఆర్ఎస్ పార్టీ నుంచే చాలామంది ఎమ్మెల్యేలు నేర్చుకున్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన సమయంలో పార్టీకి పూర్తిస్థాయిలో మెజారిటీ ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి చాలామంది ఎమ్మెల్యేలను ఆ పార్టీలో చేరేటట్టు చేశారు కేసీఆర్.. ఆయన నేర్పిన విద్య ప్రస్తుతం ఆయనకే ఇబ్బందికరంగా మారిందని చెప్పవచ్చు. ఆయన ఎలాంటి ధోరణి వ్యవహరించారో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు కూడా అలాగే వ్యవహరిస్తున్నారని రాజకీయ మేధావులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: