యూట్యూబ్లో ఫన్ బకెట్ వీడియోలతో వచ్చిన క్రేజ్ తో పలు చిత్రాలలో కమెడియన్ గా నటించి బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చి మరింత క్రేజ్ సంపాదించారు మహేష్ విట్టా. అయితే ఒక చిత్రంలో హీరోగా కూడా నటిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ తన లైఫ్ లో జరిగిన కొన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నారు.


ముఖ్యంగా బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ చిత్రంలో తనను తీసుకొని చివరి నిమిషంలో తీసేసిన విషయాన్ని తెలియజేశారు. డాకు మహారాజ్ సినిమాలో మొదట ఒక పాత్రకు తనని ఎంచుకున్నారని అంతా మాట్లాడుకున్న తర్వాత రెమ్యూనరేషన్ , డేట్స్ అన్ని కూడా ఓకే అయ్యాయి. ఊటీలో షూటింగ్ అని చెప్పారు రేపు ఊటీకి వెళ్లాల్సి ఉండగా, ఈరోజు మధ్యాహ్నం ఫోన్ చేసి ఆ పాత్ర సత్య గారు చేస్తున్నారని చెప్పారట. దీంతో తనును తీసేసినట్టుగా కూడా తెలిపారు. ఆ సమయంలోనే సత్య అలాంటి చిన్న పాత్రలు చేసేంత ఖాళీగా ఉన్నారా అనిపించిందని, మూడే మూడు సీన్స్ ఉంటాయి, లేకపోతే ముందే ప్లాన్ చేసుకొని నన్ను టైంపాస్ కి పిలిచారా. మొదట రాయలసీమ కుర్రాడి పాత్ర కాబట్టి తనని తీసుకున్నారని కానీ చివరికి ఎవరు ఏం చేశారో తెలియదు చివరలో తనని తీసేసారని తెలిపారు మహేష్ విట్టా.


అలాగే మరొక సినిమా గురించి తెలియజేస్తూ ఒక సినిమాలో తన  కోసం పాత్ర అని సెలెక్ట్ చేశారు,  ఓపెనింగ్ కూడా అయ్యింది. పోస్టర్లో కూడా తన ఫోటో వేశారని. ప్రెస్ మీట్ కి వెళ్ళా, పూజా కార్యక్రమానికి వెళ్లా అన్ని బాగానే ఉన్నా చివరకు డేట్స్ అడిగినప్పుడు పేమెంట్ గురించి అడిగితే డబ్బులు ఏంటి అన్నారు.. ఇది మన సినిమా డబ్బులు ఉండవు ఉండవని చెప్పారు. దీంతో తన ఫ్రీగా అయితే చేయలేనని చెప్పేసానని తెలిపారు మహేష్ విట్టా.

మరింత సమాచారం తెలుసుకోండి: