కోలీవుడ్ నటుడు ధనుష్ తాజాగా ఇడ్లీ కడాయ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. తమిళ్ లో రూపొందిన ఈ సినిమాను తెలుగులో ఇడ్లీ కొట్టు అనే పేరుతో విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా పెద్ద స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుంది అని చాలా మంది అనుకున్నారు. అలాగే ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో ఈ మూవీ చాలా తక్కువ రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంటుంది అలాగే భారీ లాభాలను కూడా అందుకుంటుంది అని కూడా చాలా మంది భావించారు. కానీ ప్రస్తుతం ఇడ్లీ కొట్టు సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కలెక్షన్లు రావడం లేదు.

ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఇక మొదటి రోజు ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 30 లక్షల కలెక్షన్లు దక్కగా , రెండవ రోజు 40 లక్షలు , మూడవ రోజు 22 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా మూడు రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 92 లక్షల షేర్ ... 1.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ మూవీ మరో 3.08 కోట్ల షేర్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంటుంది. మరి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫైనల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: