కొన్ని సంవత్సరాల క్రితం సిద్ధార్థ్ హీరో గా త్రిష హీరోయిన్గా నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి అద్భుతమైన కొరియో గ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా దర్శకత్వం వహించగా ... ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ద్వారా సిద్ధార్థ్ మరియు త్రిష లకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు దక్కింది. అలాగే దర్శకుడిగా ప్రభుదేవా కు కూడా ఈ సినిమా మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఈ సినిమాకు దేవిnశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా ఈ మూవీ విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది. చాలా సంవత్సరాల క్రితం విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాను తిరిగి రీ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. 

తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను నవంబర్ 15 వ తేదీన మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు రీ రిలీజ్ లో భాగంగా కూడా అద్భుతమైన కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టాయి. మరి నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాను నవంబర్ 15 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నారు. మరి రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందో , బాక్సా ఫీస్ దగ్గర ఏ రేంజ్ ఇంపాక్ట్ ను చూపిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: