ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులు చిన్న సినిమాలను చూడడంలో అత్యంత ఆసక్తిని చూపిస్తున్నారు. దానితో కొన్ని తక్కువ బడ్జెట్లో , పెద్దగా స్టార్ కాస్ట్ లేని సినిమాలు కూడా మంచి అంచనాల నడుమ విడుదల అవుతున్నాయి. అలాగే కొన్ని చిన్న సినిమాలు మంచి అంచనాల నడుమ విడుదల కాకపోయినా విడుదల అయ్యాక మంచి టాక్ రావడంతో అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం లిటిల్ హాట్స్ అనే ఓ చిన్న సినిమా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం మన అందరికి తెలిసిందే. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా తాజాగా ఈటీవీ విన్ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకొని భారీ కలెక్షన్లను వసూలు చేసి బ్లాక్ బాస్టర్ మూవీ గా నిలిచిన ఈ సినిమా ఓ టి టి ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది. 

తాజాగా ఈ మూవీ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో 100 మిలియన్ ప్లేస్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించినట్టు ఈటీవీ విన్ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. కొంత మంది స్టార్ హీరోలు నటించిన సినిమాలకు కూడా ఓ టి టి ప్లాట్ ఫామ్ లో ఈ స్థాయి రెస్పాన్స్ రావడం లేదు. దానితో లిటిల్ హాట్స్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రమే కాదు ఓ టీ టీ లో కూడా ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: