
రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. హిట్ ఇచ్చినా, ఫ్లాప్ ఇచ్చినా, ఆయన ఎనర్జీ, ఆయన పాజిటివ్ వైబ్ అభిమానులను మాయ చేస్తూనే ఉంటాయి. చాలా మంది హీరోలు వయస్సు పెరిగిన తర్వాత స్లో అవుతారు. కానీ రవితేజ మాత్రం వయస్సు పెరుగుతున్న కొద్దీ ఇంకా ఫిట్‌గా, ఇంకా యాక్టివ్‌గా మారుతున్నారు. ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు. పాన్ ఇండియా స్టార్‌లు కూడా ఉన్నారు. కానీ రవితేజ లా ఇంత వయస్సులో కూడా ఇంత హై ఎనర్జీతో డాన్స్ స్టెప్స్ వేసే, ఫైట్ సీన్స్‌ని స్వయంగా చేయగల హీరో ఇప్పటివరకు లేరు. అది తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, ఇతర భాషల్లో కూడా చాలా అరుదు. ఇటీవల సోషల్ మీడియాలో ఇలాంటి కామెంట్స్ ఎక్కువ అయిపోయాయి. “పాన్ ఇండియా హీరోలంతా తమ రేంజ్ చూపించడానికి తపస్సు చేసినా, రవితేజ లాంటి నేచురల్ ఎనర్జీని ఎవరూ తెచ్చుకోలేరు!”
నిజమే! రవితేజ వయస్సుతో కాదు, ఆయన ఆత్మవిశ్వాసంతో, ప్యాషన్‌తో, ఎనర్జీతో జీవిస్తున్న హీరో. ఒక్క సీన్‌లో ఆయన ఎంట్రీ వస్తే చాలు .. థియేటర్ కేకలు, అరుపులు, విజిల్స్‌తో మార్మోగిపోతుంది. ఇంతటి ఎనర్జీ, ఇంతటి పాజిటివిటీ కలిగిన హీరో మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం నిజంగా గర్వకారణం. ఫ్యాన్స్ కూడా చెబుతున్నట్లుగానే ...“హిట్స్ ఫ్లాప్స్ పక్కన పెడితే, రవితేజ అంటే రవితేజే… ఆయన రేంజ్ అందనిది, ఆయన స్టైల్ కాపీ చేయలేనిది!” అందులో నో డౌట్..!