
ఇలాంటి వాతావరణంలోనే సోషల్ మీడియాలో మరో పెద్ద చర్చ మొదలైంది —“సెకండ్ జనరేషన్‌లో ఎవరు టాప్ హీరో? రామ్ చరణ్ నా..? జూనియర్ ఎన్టీఆర్ నా..?”ఫస్ట్ జనరేషన్‌లో చిరంజీవి వర్సెస్ బాలయ్య కాంబినేషన్ ఇండస్ట్రీని హీట్‌తో ముంచెత్తింది. ఇప్పుడు అదే పోటీని రెండో జనరేషన్ హీరోలు కొనసాగించనున్నారా..? అనే చర్చ జోరుగా సాగుతోంది. మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ పేరు జపిస్తుంటే, నందమూరి ఫ్యాన్స్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్‌కే “కింగ్ ఆఫ్ టాలీవుడ్” ట్యాగ్ కరెక్ట్ అని అంటున్నారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కామెంట్స్ చూస్తే, ఇద్దరికీ అపారమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని స్పష్టంగా తెలుస్తోంది. రామ్ చరణ్ “రంగస్థలం”, “ఆర్ ఆర్ ఆర్” వంటి సినిమాలతో తన నటనని అంతర్జాతీయ స్థాయిలో నిరూపించుకున్నాడు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ “జనతా గ్యారేజ్”, “అరవింద సమేత”, “ఆర్ ఆర్ ఆర్” లాంటి సినిమాలతో తన వర్సటైలిటీని చూపించాడు.
డ్యాన్సింగ్ స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ అప్పీల్, ఫ్యాన్ బేస్ — ఈ ప్రతి అంశంలోనూ ఇద్దరూ ఒక్కటేఅగా ఉన్నారు. ఎవరు ముందుంటారో చెప్పడం కష్టం. సోషల్ మీడియాలో కూడా చాలా మంది న్యూట్రల్ ఫ్యాన్స్ “ఇద్దరూ తమ తమ స్థాయిలో బెస్ట్” అని కామెంట్ చేస్తున్నారు.అయితే, రాబోయే సంవత్సరాల్లో ఎవరు పెద్ద పాన్-ఇండియా ఇంపాక్ట్ సృష్టిస్తారో, ఎవరు ఇండస్ట్రీ నంబర్ వన్ స్థానాన్ని అందుకుంటారో చూడాలి. ఒకవైపు రామ్ చరణ్ గ్లోబల్ మార్కెట్‌లో అడుగులు వేస్తుంటే, మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ హాలీవుడ్ ప్రాజెక్ట్ దిశగా ప్రయాణిస్తున్నాడు.ఇక మిగతా నిర్ణయం మాత్రం మీ చేతుల్లోనే ఉంది —మీ అభిప్రాయం ప్రకారం రెండో జనరేషన్‌లో నెంబర్ వన్ హీరో ఎవరు? రామ్ చరణ్ లేదా జూనియర్ ఎన్టీఆర్..? మీ ఆన్సర్స్‌ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి..!