
రష్మిక – విజయ్ దేవరకొండ జంట నిశ్చితార్ధం జరిగిపోయింది అంటూ టాక్ వినిపించింది. “త్వరలోనే వీళ్ళు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు” అనే వార్తలు సోషల్ మీడియాలో దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరూ ఫిబ్రవరి 14వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నారనే న్యూస్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వార్తలతో అభిమానుల్లో భారీ ఎగ్జైట్మెంట్ నెలకొంది. కానీ రష్మిక మాత్రం దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇవన్నీ పక్కన పెడితే — దీపావళి సందర్భంగా రష్మిక నుంచి రాబోతున్న మూవీ అప్డేట్ మాత్రం ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ చేయనుంది అంటున్నారు సినీ వర్గాలు. ఆమె కెరీర్‌లో ఫస్ట్ టైమ్‌గా పూర్తిగా ఫిమేల్ ఓరియెంటెడ్ పాత్రలో కనిపించబోతోంది. ప్రముఖ దర్శకుడు రవీంద్ర పులే దర్శకత్వం వహిస్తున్న చిత్రం "మైసా" . గోండుల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీలో రష్మిక ఒక శక్తివంతమైన గ్రామీణ మహిళగా, తన కుటుంబం కోసం ఎంతటి పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యవంతురాలిగా కనిపించబోతోంది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో సూపర్ హిట్ అయింది. రష్మిక లుక్, బాడీ లాంగ్వేజ్, రఫ్ అండ్ రస్టిక్ స్టైల్ చూసి అభిమానులు “ఇది ఆమె కెరీర్‌లో బెస్ట్ రోల్ అవుతుందనిపిస్తోంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన స్పెషల్ గ్లింప్స్ మరియు టీజర్ ను దీపావళి సందర్భంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.అంతే కాదు — రష్మిక నటించిన మరో భారీ ప్రాజెక్ట్ “ధామా” కూడా ఈ నెల 21వ తేదీన థియేటర్స్‌లో విడుదల కానుంది. దాంతో ఈ దీపావళి రష్మిక ఫ్యాన్స్‌కి డబుల్ డోస్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు.
ఇక రష్మిక మాత్రం తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ రెండు సినిమాలకు సంబంధించిన స్పెషల్ అప్‌డేట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు బజ్. అభిమానులు అయితే “దీపావళికే రష్మిక నుంచి గుడ్ న్యూస్ ప్యాకెట్ వస్తుందంట” అంటూ సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేస్తున్నారు.అంటే మొత్తానికి — ఈ దీపావళి రష్మిక మందన్నా ఫ్యాన్స్‌కి సెలబ్రేషన్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పొచ్చు. కెరీర్ పీక్‌లో ఉన్న రష్మికకు ఇది నిజంగా గోల్డెన్ ఫేజ్..!