
జనాలు చెబుతున్న మాటేమిటంటే — “భోలా శంకర్ సినిమాలో తమన్నాను హీరోయిన్‌గా తీసుకోవడంతో ఎన్ని ట్రోల్స్ పడ్డాడు. ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేస్తున్నాడు!” అని అంటున్నారు జనలౌ. ప్రస్తుతం చిరంజీవి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వచ్చేస్తున్నారు’ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తిగా ఫ్యామిలీ, ఎంటర్టైన్మెంట్, మాస్ ఎలిమెంట్స్ కలగలిపి ఉండబోతోందట. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఈ సినిమా తరువాత చిరంజీవి, మరో భారీ మాస్ & యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందనున్న చిత్రానికి సైన్ చేశారని సమాచారం. దీన్ని యంగ్ డైరెక్టర్ బాబి (కె.ఎస్. రవీంద్ర) తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సమ్మర్‌లో సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇప్పుడు ఈ కొత్త సినిమాకి సంబంధించిన హీరోయిన్ ఎంపికే సోషల్ మీడియాలో పెద్ద డిబేట్‌కి కారణమైంది. దర్శకుడు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ ల కోసం వెతుకుతున్నారట. ఆ లిస్ట్‌లో ప్రస్తుతం ఉన్న రెండు పేర్లు వినిపిస్తున్నాయి. రాశి ఖన్నా మరియు మాళవికా మోహనన్. ఇద్దరూ ఇండస్ట్రీలో యంగ్, గ్లామరస్, టాలెంటెడ్ హీరోయిన్‌లు. అయితే ప్రజలు చెబుతున్నది — “వాళ్ల ఏజ్ చిరంజీవి కూతురు వయసులోనే ఉంటుంది, మరి అలాంటి యంగ్ బ్యూటీస్‌ని సీనియర్ హీరో పక్కన ఎందుకు కాస్ట్ చేస్తున్నారు?” అని కొంతమంది సోషల్ మీడియాలో బాబీపై కోపం చూపుతున్నారు . “ఈ జంట అస్సలు బాగోదు”,“చిరంజీవి పక్కన మాళవికా మోహనన్ అంటే పరమ ఛండాలం జంటలా ఉంటుంది”,“ప్లీజ్ వేరే హీరోయిన్ని ఎంచుకోండి” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక కొందరు మాత్రం, “ఇందులో చిరంజీవి తప్పేమీ లేదు, ఇది డైరెక్టర్ నిర్ణయం” అని సపోర్ట్ చేస్తున్నారు. కానీ సోషల్ మీడియా ట్రోల్స్ మాత్రం వదిలే ప్రసక్తే లేదు. సినిమాలో హీరోయిన్స్ ఇంకా అధికారికంగా ప్రకటించకముందే, ఈ కాంబినేషన్ సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తోంది.ఇప్పుడు ప్రశ్న ఏంటంటే —చిరంజీవి ఈ నెగటివ్ కామెంట్లను పక్కన పెట్టి యంగ్ హీరోయిన్స్‌తోనే సినిమా చేస్తారా?లేకపోతే సోషల్ మీడియా రియాక్షన్‌కి రిస్పాండ్ అవుతారా?ఏదేమైనా, మెగాస్టార్‌కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా ట్రెండ్ అవుతుందనేది మరొకసారి రుజువైంది!