
భూమి పడ్నేకర్ ఎగ్జియా (తామర) అనే చర్మ వ్యాధితో ఇబ్బంది పడుతోందట. తన చిన్న వయసు నుంచే ఈ సమస్య ఉన్నదని కానీ ఇది మూడేళ్ల క్రితం తనకు నిర్ధారణ అయింది అంటూ తెలియజేసింది. తాను ఎక్కువగా ప్రయాణించడం లేదా పోషక ఆహారం తీసుకోకపోయినా , ఏదైనా ఒత్తిడి ఎదురైనప్పుడు చర్మం పైన దద్దుర్లు రావడం చాలా దురదగా అనిపించడం వంటివి జరుగుతున్నాయంటూ తెలియజేసింది భూమి. దీనివల్ల తనకు ఎన్నోసార్లు అసౌకర్యంగా అనిపించిందని తెలియజేసింది. అందుకే తాను ఈ సమస్య గురించి అందరికీ అవగాహన కల్పిస్తానని దీని ద్వారా ప్రజలు సకాలంలో అర్థం చేసుకొని చికిత్స తీసుకుంటారని తన అభిప్రాయంగా తెలియజేసింది.
ఎగ్జియాను ఆటోపిక్ డెర్మటైటిస్ పిలుస్తారని దీని కారణంగానే చర్మం పొడిబారడం, దురద అనిపించడం, మంట, ఎర్రటి మచ్చలు వంటివి కలుగుతాయని తెలిపారు. ఇది అంటువ్యాధి కాదు ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు వైద్య నిపుణులు తెలుపుతున్న ప్రకారం శరీర రోగ నిరోధక వ్యవస్థ లో అలర్జీ కారణంగా ఈ సమస్య ఎదురవుతుందని తెలియజేసింది. అలాగే పెర్ఫ్యూమ్ లు, రసాయన ఉత్పత్తులను అధికంగా ఉపయోగించడం వాతావరణంలో అనుకోకుండా మార్పులు, ఎక్కువ వేడి ,చెడు ఆహారం అలవాట్లు అధిక ఒత్తిడి, నిద్రలేని సమస్య వల్ల ఈ ఎగ్జియా రావడానికి ముఖ్య కారణాలు అవుతున్నాయని ఆమె తెలియజేసింది.