ఇండియన్ క్రికెట్ టీం ప్రస్తుతం అద్భుతమైన ఆట తీరును ప్రదర్శిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. కొంత కాలం క్రితం ఇండియన్ క్రికెట్ టీం ఆసియా కప్ లో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచి ఆడిన ప్రతి మ్యాచ్ లోను గెలుపొంది ఆసియా కప్ ను దక్కించుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ టీం వెస్టిండీస్ తో ఆడుతున్న టెస్ట్ సిరీస్ లో కూడా అద్భుతమైన ఆట తీరును ప్రదర్శిస్తుంది. తాజాగా ఇండియా జట్టు వెస్టిండీస్ తో రెండు టెస్ట్ సిరీస్ లను ఆడింది. ఈ రెండింటిలో కూడా భారత జట్టు గెలుపొందింది. దానితో WTC 2025-27 లో భారత జట్టు అద్భుతమైన పాయింట్లను సాధించింది.

భారత్ , వెస్టిండీస్ తో సిరీస్ స్టార్ట్ కాక ముందు WTC లో  43.56 పాయింట్లతో ఉంది. ఇక వెస్టిండీస్ తో జరిగిన సిరీస్ లో రెండు మ్యాచ్ లను కూడా గెలవడంతో ఏకంగా భారత జట్టుకు  18.34 పాయింట్లు ప్లస్ అయ్యాయి. దానితో ఈ టెస్ట్ సిరీస్ అనంతరం భారత జట్టుకు 61.90 పాయింట్లుకు చేరుకుంది. ఇలా వెస్టిండీస్ తో అద్భుతమైన ఆట తీరును కనబరిచి అద్భుతమైన పాయింట్లను సాధించిన కూడా భారత జట్టు WTC లో మూడవ స్థానంలోనే ఉంది.

ఇక WTC లో మొదటి స్థానంలో ఆస్ట్రేలియా కొనసాగుతూ ఉండగా , రెండవ స్థానంలో శ్రీలంక ఉంది. ఇక మూడవ స్థానంలో ఇండియా ఉంది. ఇక WTC లో ఇండియా ప్రస్తుతం మంచి పాయింట్లతో మూడవ స్థానంలో ఉన్న ఇంకా కష్ట పడి రెండవ స్థానం లోకి వస్తేనే WTC లో రెండవ స్థానం లోకి వచ్చి ఫైనల్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. మరి భారత జట్టు WTC 2025-27 లో ఏ ప్లేస్ లోకి వెళ్తుందో అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: