
అయితే, ఈసారి మాత్రం ఆ వార్త నిజమే అయ్యింది. ఫైనల్లీ, మెగా అభిమానులకు ఆనందాన్ని పంచుతూ ఉపాసన స్వయంగా సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ వీడియోను షేర్ చేశారు. “ఈ దీపావళి నాకు ఎంతో స్పెషల్... ఎందుకంటే ఈసారి మా ఇంట్లో డబుల్ సెలబ్రేషన్స్” అంటూ ఆనందంతో వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఉపాసన తన “మినీ సీమంతం” కు సంబంధించిన అందమైన క్షణాలను షేర్ చేశారు.ఆ వీడియోలో ఉపాసన బ్లూ కలర్ చుడిదార్‌లో మరింత అందంగా మెరిసింది. చుట్టూ కుటుంబ సభ్యులు, స్నేహితులు పూలతో, చీర సారెలతో ఆమెను ఆశీర్వదిస్తూ కనిపించారు. అందరూ ఆమె ఆరోగ్యంగా ఉండాలని, బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలని, దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ సంతోషంగా ఆమెతో కలిసి పండుగ వాతావరణం సృష్టించారు.
సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతోంది. మెగా అభిమానులు, సినీ తారలు, నెట్‌జన్లు అందరూ ఉపాసనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. “కంగ్రాట్యులేషన్స్ ఉపాసన గారు”, “మెగా ఫ్యామిలీకి గుడ్ న్యూస్”, “ఈసారి కచ్చితంగా కొడుకు పుడతాడని గట్టిగా నమ్మకం ఉంది” అంటూ కామెంట్లతో నింపేస్తున్నారు. ఉపాసన, రామ్ చరణ్ జంటకు ఇప్పటికే చిన్న పాప పుట్టిన విషయం తెలిసిందే. ఆమె పేరు “క్లిం కార” — ఆ చిన్నారి పుట్టినప్పుడు కూడా మెగా అభిమానులు సోషల్ మీడియాలో హంగామా చేశారు. ఇప్పుడు రెండో సారి తల్లి కాబోతుందన్న వార్తతో మరింత సంబరాలు మొదలయ్యాయి. దీంతో, ఈ దీపావళి మెగా ఫ్యామిలీకి నిజంగా డబుల్ సెలబ్రేషన్ సీజన్ అయింది. ఒకవైపు దీపావళి వెలుగులు, మరోవైపు కుటుంబంలో రాబోతున్న కొత్త ప్రాణం — ఈ రెండింటి ఆనందం ఇప్పుడు మెగా అభిమానుల ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.