యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో వార్ 2 అనే హిందీ సినిమా రూపొందిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే విడుదల అయింది. ఈ సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను సూర్య దేవర నాగ వంశీ ఏకంగా 92 కోట్ల భారీ వరకు దక్కించుకున్నాడు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ అపజయాన్ని అందుకుంది. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 మూవీ కి ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి ..? 92 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన ఈ మూవీ కి మొత్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి ..? నాగ వంశీ కి ఎన్ని కోట్ల నష్టం వచ్చింది ..? అనే వివరాలను తెలుసుకుందాం.

వార్ 2 మూవీ కి టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి నైజాం ఏరియాలో 13.93 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 8.05 కోట్లు , ఉత్తరాంధ్ర లో 6.10 కోట్లు , ఈస్ట్ లో 3.35 కోట్లు , వెస్ట్ లో 2.10 కోట్లు , గుంటూరు లో 4.27 కోట్లు , కృష్ణ లో 3.30 కోట్లు , నెల్లూరు లో 1.90 కోట్ల కనెక్షన్లు దక్కాయి. మొత్తంగా టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి వార్ 2 మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 43 కోట్ల షేర్ ... 64 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ మూవీ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను ఏకంగా 92 కోట్ల ధరకు సూర్య దేవర నాగ వంశీ దక్కించుకున్నాడు. ఈ సినిమాకు టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 43 కోట్ల షేర్ కలెక్షన్లు మాత్రమే దక్కడంతో ఈ మూవీ ద్వారా నాగ వంశీ కి ఏకంగా 49 కోట్ల భారీ నష్టం వచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: