ఫోటోలో కనిపిస్తున్న ఈ నటి తెలుగు బుల్లితెరపై సీరియల్ నటిగా మంచి పేరు సంపాదించి, పలు టీవీ షోలలో కనిపిస్తూ అందరిని అలరిస్తూ ఉంటుంది . అప్పుడప్పుడు కొంతమంది సెలబ్రిటీలు అభిమానులు సైతం గుర్తుపట్టలేనంతగా మారిన సందర్భాలు ఉన్నాయి. అలా ఇప్పుడు తాజాగా బుల్లితెర నటి సడన్గా వయసైపోయిన ముసలావిడగా కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇందుకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారడంతో ఈ ఫోటోలు చూసి నేటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలో ఉన్న నటి ఎవరో కాదు బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ కావ్య (దీపిక రంగరాజు).


వచ్చిరాని తెలుగుతో జోకులు వేస్తూ పలు షోలలో ఫన్నీగా నవ్విస్తూ ఉంటుంది కావ్య. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను సైతం షేర్ చేసింది. ఇందులో ఆమె వృద్ధురాలిగా గెటప్ వేసి మరి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. దీపిక రంగరాజు బ్రహ్మముడి సీరియల్ కోసమే ఇలా వృద్ధురాలి గెటప్లో ముస్తాబ్ అయ్యిందనే విధంగా వినిపిస్తున్నాయి. దీపిక రంగరాజు తమిళనాడు ప్రాంతంలో జన్మించింది. ఈమె అక్కడే తన విద్యాభ్యాసాన్ని పూర్తిచేసింది.


తన చదువు పూర్తి అయిన తర్వాత ఒక తమిళ చానల్లో న్యూస్ ప్రెజెంటర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత చిత్రీరమ్ పేసుతాడి అనే ఒక తమిళ సీరియల్ ద్వారా సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని చిత్రాలలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో మాత్రం బ్రహ్మముడి సీరియల్ తో బాగా సుపరిచితమైనది. ఇందులో రాజ్ (మానస్) భార్యగా అద్భుతంగా నటించింది. ఇక నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు సెలబ్రిటీలతో దిగిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా భారీగానే క్రేజీ సంపాదించుకుంది దీపికా రంగరాజు.

మరింత సమాచారం తెలుసుకోండి: