ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటి మనులలో పూజా హెగ్డే ఒకరు. ఈమె హిందీ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె నాగ చైతన్య హీరో గా రూపొందిన ఒక లైలా కోసం అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని , మంచి గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత వరుస పెట్టి ఈమెకు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వచ్చాయి. దానితో ఈమె అత్యంత వేగంగా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లిపోయింది. చాలా కాలం పాటు అద్భుతమైన రీతిలో కెరియర్ను ముందుకు సాగించిన ఈమెకు ఈ మధ్య కాలంలో మాత్రం సరైన విజయం లేదు. ఈమె ఆఖరుగా విజయం అందుకొని కూడా చాలా సంవత్సరాలు అవుతుంది. ఈమెకు సరైన విజయాలు లేకపోయినా వరుస పెట్టి క్రేజీ సినిమాలలో అవకాశాలు మాత్రం దక్కుతూనే ఉన్నాయి. ఈమెకు ప్రస్తుత తెలుగు సినీ పరిశ్రమతో పోలిస్తే తమిళ సినీ పరిశ్రమలో అధిక అవకాశాలు వస్తున్నాయి.

ఇప్పటికే ఈమె తమిళ్ లో కూడా చాలా సినిమాల్లో నటించింది. కానీ ఈమెకు కోలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ విజయం మాత్రం ఇప్పటివరకు దక్కలేదు. ప్రస్తుతం కూడా ఈమె అనేక క్రేజీ తమిళ సినిమాలలో నటిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ కి మరో క్రేజీ తమిళ మూవీ లో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. తమిళ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి ధనుష్ మరి కొంత కాలంలో రాజకుమార్ పెరియా సామి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు , ఆ సినిమాలో పూజా హెగ్డే ను హీరోయిన్గా కన్ఫామ్ చేసినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త నిజం అయితే పూజా హెగ్డే కు మరో తమిళ సినిమాలో అవకాశం దక్కినట్లే అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: