తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ కొన్ని సంవత్సరాల క్రితం బాహుబలి ది బిగినింగ్ , బాహుబలి ది కంక్లూజన్ అనే సినిమాలలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమానులు అయినటువంటి అనుష్క శెట్టి , తమన్నా హీరోయిన్గా నటించగా .. ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాలకు కథను అందించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాలకు సంగీతం అందించాడు. రానా విలన్ పాత్రలో నటించిన ఈ మూవీ లలో రమ్య కృష్ణ , నాజర్ , సత్యరాజ్ , కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ లు అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకున్నాయి.

ఇకపోతే ఈ రెండు సినిమాలలోని కొన్ని సన్నివేశాలను కలిపి బాహుబలి ది ఎపిక్ అనే పేరుతో తాజాగా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో భాగంగా ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల బాక్సా ఫీస్  రన్ కంప్లీట్ అయింది. ఈ మూడు రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 17.30 కోట్ల కలెక్షన్లు దక్కగా ... కర్ణాటక ఏరియాలో 3.45 కోట్లు , తమిళ్ మరియు కేరళలో కలుపుకొని 2.45 కోట్లు , హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 5.65 కోట్లు , ఓవర్ సిస్ లో 11.05 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా మూడు రోజుల్లో కలిపి ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 39.90 కోట్ల కలెక్షన్ లు వచ్చాయి. ఇలా బాహుబలి ది ఎపిక్ మూవీ కి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లు దక్కినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: