అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలలో ఒకరిగా నిలిచిన అక్కినేని నాగ చైతన్య తన నటనతో, స్క్రిప్ట్ సెలెక్షన్‌తో ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు. ఇటీవల విడుదలైన “తండేల్” సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన నాగ చైతన్య, ఆ హిట్ స్ట్రీక్‌ను కొనసాగించాలని మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నాడు. ఈ జోష్‌లోనే తన కెరీర్‌లో 24వ సినిమాను అధికారికంగా ప్రకటించాడు. ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను టాలెంటెడ్ డైరెక్టర్ కార్తిక్ వర్మ దండు తెరకెక్కిస్తున్నారు. ఆయన గత చిత్రాల్లో చూపించిన కథా దృక్పథం, సస్పెన్స్ ట్రీట్మెంట్‌ చూసినవారు ఈ కొత్త సినిమా పట్ల కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ థ్రిల్లర్‌లో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటిస్తున్న విషయం ఇప్పటికే తెలిసినదే.


తాజాగా చిత్రబృందం ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ, ఆమె పాత్ర గురించి కూడా ఆసక్తికరమైన వివరాలను వెల్లడించింది. మీనాక్షి ఇందులో ఓ పరిశోధకురాలి పాత్రలో, అంటే “దక్ష” అనే రోల్‌లో కనిపించనుంది. క్లీన్ అండ్ ఇంటెలెక్చువల్ లుక్‌లో ఆమె అద్భుతంగా సరిపోయిందని చెప్పాలి. పోస్టర్‌లో మీనాక్షి చూపిన ఇంటెన్సిటీ, బాడీ లాంగ్వేజ్ చూస్తేనే ఆ పాత్ర ఎంత స్ట్రాంగ్‌గా రాసి ఉంటుందో అర్థమవుతోంది.ఇక దర్శకుడు కార్తిక్ వర్మ దండు గతంలో చేసిన “విరూపాక్ష” లా, ఈ సారి కూడా ఓ గ్రిప్పింగ్ థ్రిల్లర్‌ను సెట్ చేశాడని సినిమా టోన్‌ చూస్తే స్పష్టమవుతోంది. టెక్నికల్ టీమ్, బ్యాక్‌డ్రాప్, క్యారెక్టర్ డిజైన్ — అన్నీ చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తున్నాయి.


ఇక మీనాక్షి లుక్ చూసిన వెంటనే చాలా మందికి నయన్తార – షారుక్ ఖాన్ నటించిన “జవాన్” సినిమా గుర్తుకు వచ్చిందని చెప్పాలి. ఆ సినిమాలో నయన్తార కూడా సీరియస్, ప్రొఫెషనల్ లుక్‌లో కనిపించి ఆకట్టుకుంది. అదే తరహా ఫీల్ ఈ పోస్టర్‌లో కూడా కనిపిస్తోంది.మొత్తానికి, నాగ చైతన్యకార్తిక్ వర్మ దండు కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ కొత్త థ్రిల్లర్‌పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. విభిన్న కథలతో, కొత్త కాన్సెప్ట్‌లతో ఎక్స్‌పెరిమెంట్స్ చేయడానికి సిద్ధంగా ఉన్న చైతన్య, ఈసారి కూడా ప్రేక్షకులను కొత్తగా ఆకట్టుకుంటాడని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ #NC24 సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో, నాగ చైతన్య కెరీర్‌లో మరో టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందో చూడాలి. ఈ సినిమా హై ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు జనాలు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: