ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అల్లు కుటుంబంపై ప్రశంసల వర్షం కురిపించారు. "మహానటుడు అల్లు రామలింగయ్య గారి గొప్ప వారసత్వాన్ని అల్లు అరవింద్ గారు ఎంతో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ అల్లు సినిమాస్ కేవలం ఒక థియేటర్ మాత్రమే కాదు, తెలుగు ప్రజలకు, సినిమా ఫ్యాన్స్‌కు అల్లు రామలింగయ్య గారి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక గొప్ప వేదిక" అని కొనియాడారు. ఈ స్థాయి మల్టీప్లెక్స్ హైదరాబాద్ నగరానికి, ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమకు అంతర్జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు తెస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు.
తనను తాను ఒక పక్కా సినిమా అభిమానిగా అభివర్ణించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, టెక్నాలజీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఈస్ట్‌మన్ కలర్, 70 ఎంఎం, డాల్బీ, విఎఫ్ఎక్స్ వరకు సినిమా ప్రయాణం అద్భుతమని ఆయన గుర్తుచేశారు."మనం బాహుబలి, కల్కి, అరుంధతి లాంటి విజువల్ వండర్స్ తీస్తున్నాం.. కానీ వాటిని ప్రదర్శించడానికి సరైన థియేటర్లు లేకపోతే ఆ కష్టం వృథా అవుతుంది. ఈ డాల్బీ సినిమా 500-700 సీటింగ్ కెపాసిటీతో ప్రేక్షకులకు బిగ్ స్క్రీన్ అనుభూతిని మళ్ళీ గుర్తుచేస్తుంది" అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ ఇక్కడ ఉండటం విశేషం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఒక ‘బ్లాక్ బస్టర్’ స్టేట్‌మెంట్ ఇచ్చారు."అల్లు అర్జున్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. భవిష్యత్తులో ఆయన హాలీవుడ్‌లో కూడా రాణించాలి. మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటాలి" అని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.అల్లు అర్జున్ తన సొంత మల్టీప్లెక్స్‌ను ప్రారంభించి మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ఏప్రిల్ 8న అట్లీతో చేసే సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ కూడా ఈ అల్లు సినిమాస్ లోనే జరగొచ్చని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి