‘తొలిప్రేమ’తో క్లాస్ హిట్ కొట్టి, రీసెంట్‌గా ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి, ఇప్పుడు నాని కోసం ఒక అదిరిపోయే స్క్రిప్ట్ సిద్ధం చేశారట.వెంకీ అట్లూరి చెప్పిన లైన్ నానికి బాగా నచ్చేసిందని, వెంటనే ఓకే చెప్పేశారని తెలుస్తోంది. నాని మార్క్ సహజత్వం, వెంకీ అట్లూరి మార్క్ ఎమోషన్స్ కలిస్తే బాక్సాఫీస్ దగ్గర బొమ్మ హిట్టు పడటం ఖాయం.ఈ క్రేజీ ప్రాజెక్టును టాలీవుడ్ లక్కీ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ నిర్మించబోతున్నారు. ఇప్పటికే వెంకీతో వరుస సినిమాలు చేస్తున్న సితార సంస్థ, నానితో మరో భారీ విజువల్ వండర్‌ను ప్లాన్ చేస్తోంది.
నాని ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. కథల ఎంపికలో ఆయన చూపిస్తున్న వేగం చూస్తుంటే కుర్ర హీరోలకు నిద్ర పట్టడం లేదనిపిస్తోంది.ది ప్యారడైజ్:‘దసరా’ కాంబో మళ్ళీ రిపీట్ అవుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.బ్లడీ రోమియో: సుజీత్ మార్క్ స్టైలిష్ యాక్షన్ లో నాని ఎలా ఉంటారో అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.వెంకీ అట్లూరి ప్రాజెక్ట్: ఇవన్నీ పూర్తవ్వగానే వెంకీ డైరెక్షన్‌లో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అంటే నాని డైరీ కూడా ఇంచుమించు 2027-28 వరకు లాక్ అయిపోయినట్టే!ప్రతి సినిమాతోనూ కొత్తదనం చూపిస్తూ ‘నాని 34’, ‘నాని 35’ అంటూ బాక్సాఫీస్ దగ్గర జెండా పాతడానికి రెడీ అవుతున్నారు.మరి దీనిపై అధికారిక క్లారిటీ బయటకి రావాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి