హీరో పాత్రను బట్టి ముందుగా స్వాతిముత్యం సినిమాకి శివయ్య టైటిల్ పెడదామనుకున్నారట. కానీ చివరికి స్వాతిముత్యం అని ఫిక్స్ అయ్యారు.
ఆస్కార్ కు ఎంట్రీ ఇచ్చిన మొట్టమొదటి దక్షిణాది సినిమా ఇదే.. అలాగే అంతకుముందు మాస్కో ఫిలిం ఫెస్టివల్ లో కూడా ప్రదర్శించారు.
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు) గా జాతీయ పురస్కారంతో పాటు, మూడు నంది అవార్డులు ఈ చిత్రానికి లభించాయి.
అమాయకంగా ఉండే హీరో (కమల్ హాసన్) మామూలు వ్యక్తిగా మారేలా ముందుగా క్లైమాక్స్ ని ప్లాన్ చేసినప్పటికీ అందుకు నిర్మాత నాగేశ్వరరావు ఒప్పుకోలేదు.
అలాగే హీరోయిన్ పాత్రను ముగించకుండా ఈ సినిమా సుఖాంతం చేయాలని మొదట డైరెక్టర్ భావించిన కొన్ని చర్చల వల్ల దానిని మార్చి హృదయాన్ని బరువెక్కించే సీన్స్ తో పూర్తి చేశారు.
కమలహాసన్ మనవడిగా అల్లు అర్జున్ నటించారు. రాధిక కొడుకుగా నటుడు కాంతారావు మనవడు కార్తీక్ ఇందులో కనిపిస్తారు.
స్వాతిముత్యం సినిమా 25 కేంద్రాల 100 రోజులు పూర్తి చేసుకుంది. బెంగళూరు, మైసూరు వంటి ప్రాంతాలలో ఏడాదికి పైగా ఆడడం ఒక రికార్డు.
1994లో విడుదలైన ఆంగ్ల చిత్రం ఫారెస్ట్ గంప్ చిత్రంలోని హీరో క్యారెక్టర్ స్వాతి ముత్యం లోని శివయ్య పాత్రను పోలి ఉన్నట్టుగా కనిపిస్తుంది.
డైరెక్టర్ కె విశ్వనాథ్ దర్శకత్వంలో ఈశ్వర్ అనే పేరుతో ఈ సినిమాని రీమేక్ చేశారు. విజయశాంతికి ఇదే మొదటి హిందీ సినిమా అనిల్ కపూర్ హీరోగా నటించారు. కన్నడలో రాజేంద్ర బాబు దర్శకత్వంలో సుదీప్ హీరోగా రీమేక్ చేశారు.
ఇలాంటి సున్నితమైన అంశంతో తెరకెక్కించిన సినిమా అటు వాణిజ్యపరంగా కూడా విజయం అందుకోవడం కేవలం కె.విశ్వనాథ్ రచయిత, దర్శకత్ ప్రభావం వల్లే ఇది సాధ్యమైందని చెప్పవచ్చు. ఎన్నోసార్లు నిర్మాత ఏడిద నాగేశ్వరరావు, కె విశ్వనాథ్ కాంబినేషన్ సినిమా అంటే సక్సెస్ అన్నట్టుగా నిరూపించారు. స్వాతిముత్యం సినిమాకి ఇళయరాజా అందించిన పాటలు, మ్యూజిక్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా అందించారు.
శివయ్యగా (కమలహాసన్ )లలిత పాత్రలో (రాధిక) నటన అద్భుతంగా ఉంది. ఈ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ ఒక కల్ట్ క్లాసికల్ అంటూ చెబుతూ ఉంటారు. ఈ సినిమా యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి