చాలామంది ఆయన నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ టైగర్ జిందా హైను గుర్తు చేస్తూ, అదే తరహా ఎనర్జీ ఈ ఫోటోలలో కనిపిస్తోందని అంటున్నారు. కొందరు అభిమానులు “ఇండియాలో ఫిట్‌నెస్‌కు నిజమైన ఐకాన్ సల్మాన్ ఖాన్ మాత్రమే” అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.అంతేకాకుండా, ఈ ఫొటోల వెనుక సల్మాన్ కొత్త సినిమా ప్రిపరేషన్ ఉందనే టాక్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఆయన ప్రస్తుతం తన తదుపరి యాక్షన్ ఎంటర్‌టైనర్ “బ్యాటిల్ ఆఫ్ గాల్వన్” కోసం కఠినమైన ట్రైనింగ్ తీసుకుంటున్నారట. ఈ సినిమా ఒక భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు సమాచారం.
ఫొటోలు షేర్ చేస్తూ సల్మాన్ రాసుకున్న క్యాప్షన్ కూడా చాలా ఉంది.“కొన్ని సాధించాలంటే కొన్ని వదులుకోవాలి... కానీ ఇది నేను ఏదీ వదులుకోకుండా సాధించాను.”(హిందీలో ఆయన ఇలా రాశారు: “Kuch hasil karne ke liye kuch chhodna padta hai... yeh bina chhode hasil kiya hai.”) ఈ ఒక్క లైన్‌తోనే సల్మాన్ తన క్రమశిక్షణ, డెడికేషన్, కఠిన శ్రమ ఎంత స్థాయిలో ఉన్నాయో స్పష్టం చేశారు.సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ అన్నీ ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఫొటోలతో నిండిపోయాయి. అభిమానులు మాత్రమే కాదు, పలువురు సినీ ప్రముఖులు కూడా ఆయన ఫిట్‌నెస్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.చాలా మంది ఈ పిక్స్ ని జూమ్ చేసి మరీ ఆయన సిక్స్ ప్యాక్ చూస్తున్నారు. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని మరోసారి నిరూపించిన సల్మాన్ ఖాన్, తన కొత్త లుక్‌తో మళ్లీ “బాలీవుడ్ టైగర్” ఎందుకని పిలుస్తారో చూపించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి