ఇక అప్పుడప్పుడు ప్రైవేట్ ఈవెంట్లలో కూడా పాల్గొంటూ వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టేలా చూస్తోంది సమంత. ఇప్పటికే పిరిల్ బాల్ అనే బ్రాండ్ కు స్పాన్సర్ గా మారింది. తాజాగా సమంత కొత్త పెర్ఫ్యూమ్ వ్యాపారంలోకి అడుగుపెట్టినట్లుగా తెలుస్తోంది. తానే సొంతంగా ఒక బ్రాండ్ ను స్థాపించి అందుకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ నిన్నటి రోజున ముంబైలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో ఈ బ్రాండ్ అని ఆవిష్కరించినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా సమంత తన అల్ట్రా మోడ్రన్ లుక్ లో తన అందంతో మరింత ఆకట్టుకునేలా చేసింది. బ్లాక్ అవుట్ ఫిట్ లో కనిపించిన తీరు అక్కడికి వచ్చిన అతిథులు, మీడియా ప్రతినిధులనే కాకుండా అభిమానులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సమంతని ఈ డ్రెస్సులో చూస్తే ఏజ్ పెరుగుతున్న గ్లామర్ విషయంలో మాత్రం మార్పు కనిపిస్తోందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి హీరోయిన్ తమన్నా కూడా హాజరుకాగా అయితే తమన్నాని మించి మరి సమంత తన గ్లామర్ తో హైలైట్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం సమంత గ్లామర్ తో టాప్ లేపిన ఈ ఫోటోలు సైతం వైరల్ గా మారుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి