ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికలలో కూడా మనమే గెలిచాము. ఎన్నికలు ఏవైనా సరే కూటమి గెలుపే కావాలని పంచాయతీల మాదిరిగానే నీటి సంఘాలు నీటి పన్నులు కూడా వసూలు చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు కి తెలియజేశారు ఏపీ సీఎం. మీరు చేస్తున్న పనుల ను మీడియా ముందు చెప్పుకోవడంలో విఫలమవుతున్నారంటూ మంత్రుల పైన కూడా ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ కొరత అంశం పైన సీఎం చంద్రబాబు స్పందిస్తూ గ్యాస్ కొరత రాకుండా ఉండేందుకు నిరంతరం అధికారులు పర్యవేక్షణ చేస్తూ ఉండాలని సూచించారు.
అంతేకాకుండా కొంతమంది గ్యాస్ కి ప్రయత్నంగా ఎలక్ట్రిక్ స్టవ్వులను ఉపయోగిస్తున్నారని మంత్రులు చెప్పగా వాటి వల్ల విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యుత్తు మీద పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అలాగే యుద్ధ ప్రభావిత దేశాలలో ఉన్న తెలుగు ప్రజల పైన కూడా భద్రత మీద ప్రత్యేక దృష్టి తీసుకోవాలని సూచించారు. ఇటీవలే జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో తీసుకుని నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు అయ్యేలా మంత్రులు ఇన్చార్జి మంత్రులు కృషి చేయాలంటూ సూచించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి