ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో రాణించాలి అనుకున్న ఉపాసన జీవితాన్ని మార్చిన ఆ ఘటన ఏంటి.. ఆ ఒక్క ఘటనతో ఉపాసన సేవ చేయాలని ఫిక్స్ అయిందా? ఇంతకీ ఉపాసనని కన్నీళ్లు పెట్టించిన ఆ చావు ఎవరిది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. ఉపాసన మెగా ఫ్యామిలీ కోడలు కాకముందే పేరున్న ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయి. ఇక మెగా ఫ్యామిలీ లోకి కోడలుగా వెళ్లాక ఈమె పేరు ప్రఖ్యాతలు మరింత పెరిగాయి. అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్ గా బాధ్యతాయుతమైన స్థానంలో ఉంది. తన తాత ప్రతాప్ రెడ్డి స్థాపించిన అపోలో హాస్పిటల్స్ కి దేశవ్యాప్తంగా మంచి పేరు ఉంది. అయితే ఉపాసన ఈ హాస్పిటల్ రంగంలోకి రావాలి అనుకోలేదట. మొదట ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలోకి వెళ్లాలనుకుందట.కానీ ఈ విషయం చెప్పడంతోనే తాత ప్రతాప్ రెడ్డి నువ్వు ఎంచుకున్న రంగంలో కొంతమందికే సేవ చేయగలవు..

 అందుకే ఎక్కువ మందికి సేవ చేసే రంగాన్ని ఎంచుకో అని చెప్పారట. ఇక తాతయ్య మాటలతో ఉపాసన కాస్త ఇన్స్పైర్ అయ్యి ఓ రోజు అపోలో హాస్పిటల్ కి వెళ్ళిందట. అయితే ఆరోజు ఒక భవనిర్మాణ కార్మికురాలు.. పేద మహిళ కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ఏమైంది అని అడగగా..తన కొడుకుకు ఉన్న ప్రాబ్లం గురించి ఆ మహిళ చెప్పిందట. తన కొడుకు చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడని, చికిత్స చేయించాలంటే చాలా డబ్బులు కావాలని తెలిపిందట. ఆ సమయంలో ఆ బాబు గుక్కపెట్టి ఏడుస్తున్నాడట. అయితే ఆ తల్లి కన్నీళ్లు,బాబు ఏడుపును చూసి చలించిపోయిన ఉపాసన ఆ బాబు చికిత్సకి అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని చికిత్స చేయించిందట. కానీ ఉపాసన తన దయా హృదయంతో ముందుకు వచ్చి ట్రీట్మెంట్ చేయించినా ఫలితం లేదు. ఎందుకంటే ఆ బాబు చనిపోయాడు. అయితే ఆ మహిళకు అప్పటికే పుట్టిన సంతానం అందరూ అలాగే చనిపోయారట.

అలా నలుగురు సంతానం చనిపోయారట.ఈ విషయం తెలిసిన ఉపాసన ఆమెకు ఆర్థికంగా అండగా నిలిచిందట.ఆ సమయంలో ఆ మహిళ ఐదోసారి ప్రెగ్నెంట్ అయ్యిందంట. అదే సమయంలో ఉపాసన ఆమెకి అండగా నిలిచింది. కానీ ఐదో సంతానం గా పుట్టిన బేబీ హెల్తీగా ఉండడంతో ఆ తల్లి చాలా సంతోష పడిందట. ఆరోజు ఆ తల్లి మొహంలో సంతోషం చూసి ఉపాసన తన నిర్ణయాన్ని మార్చుకొని ఫ్యాషన్ డిజైనింగ్ ని వదిలేసుకొని అపోలో హాస్పిటల్స్ ని డెవలప్ చేయడం కోసం ఈ రంగంలోకి దిగిందట.అలా ఒకరికి సాయం చేస్తే వచ్చే సంతోషం ఎలా ఉంటుందో పూర్తిగా ఎక్స్పీరియన్స్ చేసిన ఉపాసన తన వంతు కృషి చేస్తూ ఎంతో మంది పేదలకు వైద్యం అందిస్తుంది. అంతేకాకుండా చిన్నపిల్లలకు వచ్చే గుండె సమస్యలను తగ్గించడానికి సేవ్ ఏ చైల్డ్ హార్ట్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలాగే క్యాన్సర్ తో పోరాడే పేదలకు క్యూర్ పేరుతో ఉచిత వైద్యం అందిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: