హీరో శ్రీకాంత్.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈయన చేయని క్యారెక్టర్  లేదు. విలన్ గా.. హీరోగా.. ఎన్నో పాత్రల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నారు. అలాంటి శ్రీకాంత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఉన్నటువంటి  ఊహను ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఊహకంటే ముందు ఆయన మరో అమ్మాయితో కూడా డీప్ గా ప్రేమలో పడ్డారట.  మరి అది ఎప్పుడు ఆ అమ్మాయి ఎవరో ఆ వివరాలు చూద్దాం.. ఎవరికైనా ఫస్ట్ లవ్ అనేది ఉంటుంది.. ఆ విధంగానే శ్రీకాంత్ కూడా ఫస్ట్ లవ్ ఊహ కాదు.. తాను చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించారట. చివరికి ఆమెని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట.. మరి ఏం జరిగింది అంటే.. శ్రీకాంత్ హీరో కావాలని చెప్పి ఇంటర్లోనే తన ఇంటి నుంచి పారిపోయి మద్రాస్ చేరుకున్నాడు. 

అక్కడ చాలా స్టూడియోలు తిరిగినా కానీ ఆయన్ని ఎవరు గేటు కూడా దాటనివ్వలేదు. దీంతో అవమానపడ్డ శ్రీకాంత్ కి ఆరోజు తన సిస్టర్ కాల్ చేసి పేరెంట్స్ ఏడుస్తున్నారు ఇంటికి వచ్చేయ్ అని చెప్పిందట.అంతేకాకుండా డిగ్రీ అయిపోయాక సినిమాల్లోకి పంపిస్తామని మాట ఇవ్వడంతో మళ్ళీ ఇంటికి వెళ్ళాడు.వెంటనే శ్రీకాంత్ డిగ్రీలో జాయిన్ అయిపోయారు. ఇంతలో ఆయన చదువుకునే కాలేజీలోనే ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించారట. అప్పట్లో ప్రేమిస్తే ఇప్పటిలాగా డైరెక్ట్గా చెప్పే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. వన్ సైడ్ లవ్వే ఉండేది. అలా అమ్మాయిని శ్రీకాంత్ చాలా ప్రేమిస్తున్న సమయంలోనే, మరో అబ్బాయి కూడా అదే అమ్మాయిని ప్రేమించారు. ఈ విషయాన్ని ఆ వ్యక్తి శ్రీకాంత్ కే వచ్చి చెప్పి నాకు హెల్ప్ చేయాలి రా అన్నాడట.

 సరే ఓకే ఆ అమ్మాయికి నీ లవ్ విషయం చెప్పని శ్రీకాంత్ తన ఫ్రెండ్ కు చెప్పడంతో ఆయన వెళ్లి చెప్పగానే అమ్మాయి నో చెప్పిందట. దీంతో శ్రీకాంత్ లో లోపల చాలా ఆనందపడ్డాడట.. ఇక లైన్ క్లియర్ అయిందని ఆ అమ్మాయిని తాను ప్రేమిస్తున్న విషయం చెప్పడానికి చాలా భయపడిపోయాడు. అలా మూడు సంవత్సరాలు గడిచి చివరికి తన డిగ్రీ కూడా పూర్తయిపోయింది. ఆ తర్వాత అమ్మాయి టచ్ లో కూడా లేకుండా పోయిందని శ్రీకాంత్ ఒక షోలో ఈ విషయాన్ని చెప్పారు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి హీరోగా ఎదిగారు. ఊహతో ప్రేమలో పడి చివరికి ఆమెనే తన లైఫ్ పార్టనర్ గా ఎంచుకొని  హ్యాపీగా జీవిస్తున్నారు. శ్రీకాంత్ హీరో విలన్ క్యారెక్టర్లు చేసుకుంటూ చాలా బిజీగా ఉన్నారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: