టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని హీరో నాగచైతన్య మధ్య ప్రేమ , పెళ్లి వ్యవహారం ఎంత చర్చల్లో నిలిచిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ కలిసి 40 సినిమాలలో జంటగా నటించారు. అయితే తొలి సినిమా ఏ మాయ చేసావే సినిమా టైమ్ నుంచి ఏర్పడిన ప్రేమ చివరకు పెళ్లిగా మారింది. అయితే పెళ్లి చేసుకున్న నాలుగేళ్లకే వీరిద్దరూ మనస్పర్ధలతో విడిపోయారు. చైతు - సమంత ప్రేమలో ఉండి పెళ్లి చేసుకోవడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు .. తెలుగు సినీ ప్రేమికులు అందరూ ఎంతో సంతోషపడ్డారు. వీరిద్దరూ విడిపోయినప్పుడు కూడా అంతే బాధపడ్డారు. చైతు - సమంత ఏం చేసిన వార్తల్లో హైలైట్ అయ్యేది. ఇప్పుడు మళ్లీ అంతలా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ .. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రేమ వ్యవహారం వార్తల్లో నిలుస్తోంది.
ఇప్పటికే వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రాజస్థాన్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగబోతుందని తెలుస్తోంది. చైతు - సమంత ప్రేమ పెళ్లి పై దేశవ్యాప్తంగా ఎలాంటి హైప్ ఉందో ఇప్పుడు విజయ్ - రష్మిక మందన్న ప్రేమ , పెళ్లి వార్తలు విషయంలోనూ అంతే హైప్ నడుస్తోంది. వీరిద్దరూ తమ ప్రేమ పెళ్లి తర్వాత జీవితాన్ని ఎంతో అందంగా డిజైన్ చేసుకొని అనవసర హైప్ కు చెక్ పెట్టి ఎవరి జీవితాన్ని వారు ముందుకు కొనసాగించుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. పెళ్లి తర్వాత విజయ్ - రష్మిక ఇద్దరు సినిమాలలో నటించినా .. వీరి సినిమా కేరియర్ తమ పర్సనల్ కేరియర్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిజైన్ చేసుకోవాలని కూడా పలువురు సూచిస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి