ఇటీవల కాలంలో చాలామంది సెలబ్రిటీలను అభిమానులు కలవడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. మరి కొంతమంది షోలలో కనిపించి ఆనందపరుస్తుంటారు. అయితే ఇటీవల గత కొద్ది రోజుల క్రితం నుంచి తిరుపతి ప్రాంతానికి చెందిన మురళి అనే ఒక పెద్దాయన చిరంజీవి పాటలకు డాన్స్ వేస్తూ ఢీ షోలో అందరినీ ఆకట్టుకుంటున్నారు. దీపావళి సందర్భంగా ఒక ఈవెంట్ నిర్వహించగా మురళి స్పెషల్ డాన్స్ చేశారు. ముఖ్యంగా మురళి చిరంజీవికి పెద్ద అభిమానిని ఎన్నోసార్లు తెలియజేశారు. ఇదే ఈవెంట్ కి నాగబాబు గెస్ట్ గా రావడంతో మురళి డాన్స్ కి ఫిదా అయ్యారు. ఈ వయసులో కూడా ఆయన డాన్స్ ని చూసి మైమర్చిపోయారు.


ముఖ్యంగా చిరంజీవిని కలవాలని కోరిక తనలో ఉందని చెప్పడంతో ఆ కోరికను తీరుస్తానని అంతేకాకుండా ఆయనతో కూర్చోబెట్టి మరి మాట్లాడించి ,టీ కూడా తాగిస్తానంటూ చెప్పడంతో మురళి ఆనందానికి అవధులు లేవు. తాజాగా నాగబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూటింగ్లో మురళిని చిరంజీవి కలిశారు. ఈ విషయానికి సంబంధించి విజువల్స్ కొన్ని ఢీ షోలో చూపించారు. అందుకు సంబంధించిన ప్రోమో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది.



ఈ ప్రోమోలో చిరంజీవిని కలిసిన తర్వాత పెద్దాయన మురళి మాట్లాడిన మాటలు అందర్నీ ఎమోషనల్ గా ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా హైపర్ ఆది మాట్లాడుతూ.. చిరంజీవి గారు చివరిగా ఒక మాట ఇచ్చారు. ఏదో ఒక రోజు నువ్వు నా పక్కన డాన్స్ వేసే అవకాశం ఇస్తాను అంటూ మురళికి మాట ఇచ్చారని తెలిపారు. ఈ విషయంతో మరింత ఎమోషనల్ అయ్యారు మురళి. ఇందుకు సంబంధించి ప్రోమో లో చూపించడంతా అభిమానులు కూడా చిరంజీవిని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ పెద్దాయన కోరికను తీర్చినందుకు మెగా బ్రదర్ నాగబాబుని కూడా అభినందిస్తున్నారు. మొత్తానికి ఈ ప్రోమో అయితే హైలైట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: